మెచ్చితి నే నిన్నిందుకు మేలు నీ వుపాయములు
(॥పల్లవి॥)
మెచ్చితి నే నిన్నిందుకు మేలు నీ వుపాయములు
వొచ్చెము మానఁగ సొమ్ము లొసఁగేవు నాకును
(॥మెచ్చి॥)
ఇక్కడ నే దూరేనంటా నిందాఁకా నీవాపె-
పక్కనుండి వచ్చి నాపై బత్తిసేసేవు
నిక్కి మోవియెంగిలైన నేర మెంచకుండాను
మక్కువలు చల్ల నాతో మాటలాడేవు
(॥మెచ్చి॥)
ఆకెయింట నారగించి అందు కేమీ ననకుండా
చేకొని వీడే లిక్కడఁ జేయవచ్చేవు
జోకతో మేని మచ్చము చూచి నేఁ గోపించకుండా
కైకొని గక్కన నన్నుఁ గాఁగిలించుకొనెవు
(॥మెచ్చి॥)
కలసి యాపె యిచ్చిన కప్పురము నాకిచ్చి
చలపట్టి నాకాఁక చల్లార్చేవు
నిలిచి శ్రీవెంకటేశ నేనలమేలుమంగను
యెలమితో ననుఁ గూడి యింపులు రేఁచేవు
(||pallavi||)
mĕchchidi ne ninniṁdugu melu nī vubāyamulu
vŏchchĕmu mānam̐ga sŏmmu lŏsam̐gevu nāgunu
(||mĕchchi||)
ikkaḍa ne dūrenaṁṭā niṁdām̐kā nīvābĕ-
pakkanuṁḍi vachchi nābai battisesevu
nikki moviyĕṁgilaina nera mĕṁchaguṁḍānu
makkuvalu salla nādo māḍalāḍevu
(||mĕchchi||)
āgĕyiṁṭa nāragiṁchi aṁdu kemī nanaguṁḍā
segŏni vīḍe likkaḍam̐ jeyavachchevu
jogado meni machchamu sūsi nem̐ gobiṁchaguṁḍā
kaigŏni gakkana nannum̐ gām̐giliṁchugŏnĕvu
(||mĕchchi||)
kalasi yābĕ yichchina kappuramu nāgichchi
salabaṭṭi nāgām̐ka sallārsevu
nilisi śhrīvĕṁkaḍeśha nenalamelumaṁganu
yĕlamido nanum̐ gūḍi yiṁpulu rem̐sevu