మెచ్చి రిందరును నిన్ను మేలు మేలే
(॥పల్లవి॥)
మెచ్చి రిందరును నిన్ను మేలు మేలే
కచ్చుపెట్టి చెలులము కంటిమే నీమేలు
(॥మెచ్చి॥)
చెలువుఁడు నిన్ను మెచ్చ సింగారించుకొంటి వౌనే
కొలువులో విడెమందుకొంటి వవునే
వలిపె పయ్యద పల్లెవాటు వేసికొంటి వౌనే
మెలఁగి నీ పగటులు మెరసితి వవునే
(॥మెచ్చి॥)
పతికి నింపులు వుట్ట పాటలు వాడితివౌనే
కతచెప్పి మతిఁ గరఁచితి వవునే
రతికి సన్నలుసేసి రప్పించుకొంటి వౌనే
చతురత లెల్లాను సాదించితి వవునే
(॥మెచ్చి॥)
మాటాడి శ్రీవేంకటేశు మరిగించుకొంటి వౌనే
కూటములు(ల?) మన్నన చేకొంటి వవునే
తేట తెల్లమిఁ బట్టపుదేవులవైతి వౌనే
నీటున నీతనివద్ద నెలకొంటి వవునే
(||pallavi||)
mĕchchi riṁdarunu ninnu melu mele
kachchubĕṭṭi sĕlulamu kaṁṭime nīmelu
(||mĕchchi||)
sĕluvum̐ḍu ninnu mĕchcha siṁgāriṁchugŏṁṭi vaune
kŏluvulo viḍĕmaṁdugŏṁṭi vavune
valibĕ payyada pallĕvāḍu vesigŏṁṭi vaune
mĕlam̐gi nī pagaḍulu mĕrasidi vavune
(||mĕchchi||)
padigi niṁpulu vuṭṭa pāḍalu vāḍidivaune
kadasĕppi madim̐ garam̐sidi vavune
radigi sannalusesi rappiṁchugŏṁṭi vaune
sadurada lĕllānu sādiṁchidi vavune
(||mĕchchi||)
māḍāḍi śhrīveṁkaḍeśhu marigiṁchugŏṁṭi vaune
kūḍamulu(la?) mannana segŏṁṭi vavune
teḍa tĕllamim̐ baṭṭabudevulavaidi vaune
nīḍuna nīdanivadda nĕlagŏṁṭi vavune