Mechcherayya naayagumda melumta leevela ninu

మెచ్చేరయ్య నాయకుఁడ మెలుఁత లీవేళ నిను
Language

(॥పల్లవి॥)
మెచ్చేరయ్య నాయకుఁడ మెలుఁత లీవేళ నిను
నిచ్చలును వలవఁగ నీవే నేర్తువయ్యా

(॥॥)
యిట్టుండవలదా యింతిమీఁదిమోహము
వొట్టుగా నాకుమడిచి యొఁసగితివి
చుట్టమవై నందుకు సుద్దులిన్ని చెప్పవద్దా
గుట్టుసేయ కింత నిండుఁ గొలువులోను

(॥॥)
ననుపింత గావలదా నలినాక్షితోడుత
యెనయుచుఁ దోడమీఁద నిడుకొంటివి
చనవిచ్చినయందుక సరసమింతాడవద్దా
పనిపడి యూకెయీడుభామలముందరను

(॥॥)
యీరీతి నవ్వవలదా యేణాక్షితోడుత
గారవించి కాఁగిటఁ గలసితివి
ఆరయ శ్రీ వేంకటేశ అందమిటు చూపవద్దా
సారెకు మోవిచ్చితి విచ్చటఁ బాన్పుమీఁదను

(||pallavi||)
mĕchcherayya nāyagum̐ḍa mĕlum̐ta līveḽa ninu
nichchalunu valavam̐ga nīve nerduvayyā

(||||)
yiṭṭuṁḍavaladā yiṁtimīm̐dimohamu
vŏṭṭugā nāgumaḍisi yŏm̐sagidivi
suṭṭamavai naṁdugu suddulinni sĕppavaddā
guṭṭuseya kiṁta niṁḍum̐ gŏluvulonu

(||||)
nanubiṁta gāvaladā nalinākṣhidoḍuda
yĕnayusum̐ doḍamīm̐da niḍugŏṁṭivi
sanavichchinayaṁduga sarasamiṁtāḍavaddā
panibaḍi yūgĕyīḍubhāmalamuṁdaranu

(||||)
yīrīdi navvavaladā yeṇākṣhidoḍuda
gāraviṁchi kām̐giḍam̐ galasidivi
āraya śhrī veṁkaḍeśha aṁdamiḍu sūbavaddā
sārĕgu movichchidi vichchaḍam̐ bānpumīm̐danu