Mechchavaladaa neevu melumta nerubulagu

మెచ్చవలదా నీవు మెలుఁత నేరుపులకు
Language

(॥పల్లవి॥)
మెచ్చవలదా నీవు మెలుఁత నేరుపులకు
హెచ్చుకుందు లెంచుకొని యెగ్గులు వట్టుదురా

(॥॥)
పంతమాడి నీమోవిఁ బచ్చిసేఁత సేసితేను
కాంతనేల దూరేవు గద్దెనతోను
దొంతినున్నవలపులు దోమటిదొడికితేను
చింతతోడ నిపుడేల శిరసువంచేవు

(॥॥)
ఇట్టె జవ్వనమదాన నెంగిలి నిన్నుఁ జేసితే
తిట్టులేల తిట్టేవు దీకొనుచు
గుట్టుతోడఁ దరితీపుగుణ మేరుపరచితే
వొట్టుకొని చింతలేల వొడిగట్టుకొనేవు

(॥॥)
రావాడి కడపలోన రతి నలయించితేను
శ్రీవేంకటేశుడ యెంత చిమ్మిరేఁగేవు
వేవేలుతమకముల వీడుదోడు లాడితేను
చేవదేర నెంతేసి సెలవి నవ్వేవు

(||pallavi||)
mĕchchavaladā nīvu mĕlum̐ta nerubulagu
hĕchchuguṁdu lĕṁchugŏni yĕggulu vaṭṭudurā

(||||)
paṁtamāḍi nīmovim̐ bachchisem̐ta sesidenu
kāṁtanela dūrevu gaddĕnadonu
dŏṁtinunnavalabulu domaḍidŏḍigidenu
siṁtadoḍa nibuḍela śhirasuvaṁchevu

(||||)
iṭṭĕ javvanamadāna nĕṁgili ninnum̐ jeside
tiṭṭulela tiṭṭevu dīgŏnusu
guṭṭudoḍam̐ daridībuguṇa merubaraside
vŏṭṭugŏni siṁtalela vŏḍigaṭṭugŏnevu

(||||)
rāvāḍi kaḍabalona radi nalayiṁchidenu
śhrīveṁkaḍeśhuḍa yĕṁta simmirem̐gevu
veveludamagamula vīḍudoḍu lāḍidenu
sevadera nĕṁtesi sĕlavi navvevu