Mechchavaddaa ninnimdugu mikkili jaanamda vani

మెచ్చవద్దా నిన్నిందుకు మిక్కిలి జాణఁడ వని
Language

(॥పల్లవి॥)
మెచ్చవద్దా నిన్నిందుకు మిక్కిలి జాణఁడ వని
పచ్చిదేరె నీ పనులు బాపు బాపు విభుడా

(॥మెచ్చ॥)
సెలవులఁ గొంత నవ్విచెక్కునఁ జేయి మోపి
మొలపించె వలపులు మోహనాంగి
జలజలఁ జెమరించి చన్నులపైఁ జెయివేసి
అలమి పండఁజేసితి వప్పుడేకా విభుఁడా

(॥మెచ్చ॥)
కన్నులఁ దప్పక చూచి కమ్మటి సిగ్గులు వెంచి
వన్నెలమాటల నాపె వల వేసెను
సన్నలనే మొక్కి పంచసాయకునివేఁటలకు
అన్నిటాఁ దెర లొడ్డితి వప్పుడేకా విభుఁడా

(॥మెచ్చ॥)
కప్పుర విడె మిచ్చి కాఁగిటికిఁ జేయి చాఁచి
కప్పినసింగారాల నంగడి వెట్టెను
కుప్పగా బేహరమాడి కూడితివి చెలి నిట్టె
విప్పనికూరిముల శ్రీవేంకటాద్రి విభుఁడా

(||pallavi||)
mĕchchavaddā ninniṁdugu mikkili jāṇam̐ḍa vani
pachchiderĕ nī panulu bābu bābu vibhuḍā

(||mĕchcha||)
sĕlavulam̐ gŏṁta navvisĕkkunam̐ jeyi mobi
mŏlabiṁchĕ valabulu mohanāṁgi
jalajalam̐ jĕmariṁchi sannulabaim̐ jĕyivesi
alami paṁḍam̐jesidi vappuḍegā vibhum̐ḍā

(||mĕchcha||)
kannulam̐ dappaga sūsi kammaḍi siggulu vĕṁchi
vannĕlamāḍala nābĕ vala vesĕnu
sannalane mŏkki paṁchasāyagunivem̐ṭalagu
anniḍām̐ dĕra lŏḍḍidi vappuḍegā vibhum̐ḍā

(||mĕchcha||)
kappura viḍĕ michchi kām̐giḍigim̐ jeyi sām̐si
kappinasiṁgārāla naṁgaḍi vĕṭṭĕnu
kuppagā beharamāḍi kūḍidivi sĕli niṭṭĕ
vippanigūrimula śhrīveṁkaḍādri vibhum̐ḍā