Mechchavaddaa neevimdugu melumta voja

మెచ్చవద్దా నీవిందుకు మెలుఁత వోజ
Language

(॥పల్లవి॥)
మెచ్చవద్దా నీవిందుకు మెలుఁత వోజ
కొచ్చి నిన్నుఁ గొసరదు గుట్టుతోడను

(॥మెచ్చ॥)
వెలఁదులచేతనే విన్నవింపించీఁ గాని
చెలి నీతో మాటాడదు సిగ్గుతోడను
కలువపూవులు నీకుఁ గానుక యిచ్చీఁ గాని
తలయెత్తదు నీవొద్దఁ దన యణఁకువను

(॥మెచ్చ॥)
వుల్లములో దయవుట్ట నూడిగాలు సేసీఁగాని
వెల్లవిరిఁ దమకము వెదచల్లదు
వొల్లనే నీపదముల వొద్దికఁ బాడీఁ గాని
పెల్లున నిన్నుఁ బేర్కొని పిలువఁగఁ జాలదు

(॥మెచ్చ॥)
గక్కన నదరిపాటు కాఁగిలించుకొనీఁ గాని
తక్కి వోరువఁగ లేదు తమితోడను
యిక్కడ శ్రీవేంకటేశ యీకెను నీవేలితివి
వెక్కసాన నలయదు వేవేలరతులను

(||pallavi||)
mĕchchavaddā nīviṁdugu mĕlum̐ta voja
kŏchchi ninnum̐ gŏsaradu guṭṭudoḍanu

(||mĕchcha||)
vĕlam̐dulasedane vinnaviṁpiṁchīm̐ gāni
sĕli nīdo māḍāḍadu siggudoḍanu
kaluvabūvulu nīgum̐ gānuga yichchīm̐ gāni
talayĕttadu nīvŏddam̐ dana yaṇam̐kuvanu

(||mĕchcha||)
vullamulo dayavuṭṭa nūḍigālu sesīm̐gāni
vĕllavirim̐ damagamu vĕdasalladu
vŏllane nībadamula vŏddigam̐ bāḍīm̐ gāni
pĕlluna ninnum̐ bergŏni piluvam̐gam̐ jāladu

(||mĕchcha||)
gakkana nadaribāḍu kām̐giliṁchugŏnīm̐ gāni
takki voruvam̐ga ledu tamidoḍanu
yikkaḍa śhrīveṁkaḍeśha yīgĕnu nīvelidivi
vĕkkasāna nalayadu vevelaradulanu