మెచ్చరే యీకె నిందుకు మెలుఁతలాల
(॥పల్లవి॥)
మెచ్చరే యీకె నిందుకు మెలుఁతలాల
అచ్చమైన యాఁటదాని కన్నియు నమరునే
(॥మెచ్చ॥)
కూరిమి గలది పతిఁ గొసరఁగఁదగునే
వోరుపు గలది వొద్దనుండఁదగునే
మేరతోడ మెలఁగేది మేలమాడఁదగునే
వూరకె మీ రాపె నేల వుప్పతించేరే
(॥మెచ్చ॥)
ప్రియము గలిగినది పెనఁగఁగఁదగునే
నయగారియైనది నవ్వఁదగునే
క్రియ యెఱిఁగినది మొక్కి పొగడఁదగునే
రయమున నాపె నేల రాఁపుసేసేరే
(॥మెచ్చ॥)
సేసవెట్టినాపెకు చెనకఁగఁదగునే
ఆసగలదానికి నంటఁదగునే
యీసరి శ్రీవేంకటేశుఁ డేలినాఁడు మమ్మిద్దరి
వేసరకు యాపె నేల వెంగేలాడేవే
(||pallavi||)
mĕchchare yīgĕ niṁdugu mĕlum̐talāla
achchamaina yām̐ṭadāni kanniyu namarune
(||mĕchcha||)
kūrimi galadi padim̐ gŏsaram̐gam̐dagune
vorubu galadi vŏddanuṁḍam̐dagune
meradoḍa mĕlam̐gedi melamāḍam̐dagune
vūragĕ mī rābĕ nela vuppadiṁchere
(||mĕchcha||)
priyamu galiginadi pĕnam̐gam̐gam̐dagune
nayagāriyainadi navvam̐dagune
kriya yĕṟim̐ginadi mŏkki pŏgaḍam̐dagune
rayamuna nābĕ nela rām̐pusesere
(||mĕchcha||)
sesavĕṭṭinābĕgu sĕnagam̐gam̐dagune
āsagaladānigi naṁṭam̐dagune
yīsari śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu mammiddari
vesaragu yābĕ nela vĕṁgelāḍeve