మెచ్చనిదాననా నీవు మితిమీరఁగాఁ గాక ని
(॥పల్లవి॥)
మెచ్చనిదాననా నీవు మితిమీరఁగాఁ గాక ని-
న్నెచ్చరించే దాననా యిచ్చలోనే కాక
(॥మెచ్చ॥)
యింత నీవు వద్దునుండే దెరఁగనిదాననా నీ-
పంతము చెడీనంటాఁ బట్టఁగాక
అంతకంటె ముద్దుమాఁట లాడకుండేదాననా
వింతరీతిఁ దిరుగఁగా వెరచితిఁగాక
(॥మెచ్చ॥)
గుట్టునఁ బిలువఁగ నే కొంకేటిదాననా నీ-
వొట్టు దప్పీనని లోన నుంటిఁగాక
తొట్టి ననీ మైచెమట తుడువనిదాననా
మట్టు నీమైగురుతులు మాసీననికాక
(॥మెచ్చ॥)
నీకపుఁ గాఁగిట నిన్ను నించకుండేదాననా
చొక్కపునీసరితెలు చూచితిఁగాక
యెక్కువ శ్రీవేంకటేశ యిటు నీవె కూడితివి
మొక్కకుందునా నీవు మొక్కేవనికాక
(||pallavi||)
mĕchchanidānanā nīvu midimīram̐gām̐ gāga ni-
nnĕchchariṁche dānanā yichchalone kāga
(||mĕchcha||)
yiṁta nīvu vaddunuṁḍe dĕram̐ganidānanā nī-
paṁtamu sĕḍīnaṁṭām̐ baṭṭam̐gāga
aṁtagaṁṭĕ muddumām̐ṭa lāḍaguṁḍedānanā
viṁtarīdim̐ dirugam̐gā vĕrasidim̐gāga
(||mĕchcha||)
guṭṭunam̐ biluvam̐ga ne kŏṁkeḍidānanā nī-
vŏṭṭu dappīnani lona nuṁṭim̐gāga
tŏṭṭi nanī maisĕmaḍa tuḍuvanidānanā
maṭṭu nīmaigurudulu māsīnanigāga
(||mĕchcha||)
nīgabum̐ gām̐giḍa ninnu niṁchaguṁḍedānanā
sŏkkabunīsaridĕlu sūsidim̐gāga
yĕkkuva śhrīveṁkaḍeśha yiḍu nīvĕ kūḍidivi
mŏkkaguṁdunā nīvu mŏkkevanigāga