మెచ్చాయనయ్యా నేఁడు మీ యిద్దరి వినోదాలు
(॥పల్లవి॥)
మెచ్చాయనయ్యా నేఁడు మీ యిద్దరి వినోదాలు
పచ్చిదేరేనవ్వులతో భామ సిగ్గువడెను
(॥మెచ్చా॥)
మలఁగుపై నొరగుండి మగువ కిన్నెరలోన
వలచి నీపై గీతాలు వాఇంచఁగాను
వలిపె తెరమాటున తలవూఁచి మెచ్చితివి
అలరి యానీడ గని యాపె సిగ్గువడెను
(॥మెచ్చా॥)
వుప్పతిల్లి యేకతాన నుండి నాటకసాలలో
నప్పుడు నీపై చిందుల కాపె యాడఁగా
చొప్పులు సోరణగండ్లఁ జూచి నీవు చెలితోడఁ
జెప్పఁగాఁ జప్పడు విని జిగి సిగ్గు వడెను
(॥మెచ్చా॥)
పొద్దువోక నీరూపు పూఁచి చిత్ర పలకపై
కొద్దిమీర వ్రాసి పరాకున నుండఁగా
వొద్దికతో శ్రీ వేంకటోత్తమ కాఁగిలించితి
వద్దరిపాటున దానూ నటు సిగ్గువడెను
(||pallavi||)
mĕchchāyanayyā nem̐ḍu mī yiddari vinodālu
pachchiderenavvulado bhāma sigguvaḍĕnu
(||mĕchchā||)
malam̐gubai nŏraguṁḍi maguva kinnĕralona
valasi nībai gīdālu vāiṁcham̐gānu
valibĕ tĕramāḍuna talavūm̐si mĕchchidivi
alari yānīḍa gani yābĕ sigguvaḍĕnu
(||mĕchchā||)
vuppadilli yegadāna nuṁḍi nāḍagasālalo
nappuḍu nībai siṁdula kābĕ yāḍam̐gā
sŏppulu soraṇagaṁḍlam̐ jūsi nīvu sĕlidoḍam̐
jĕppam̐gām̐ jappaḍu vini jigi siggu vaḍĕnu
(||mĕchchā||)
pŏdduvoga nīrūbu pūm̐si sitra palagabai
kŏddimīra vrāsi parāguna nuṁḍam̐gā
vŏddigado śhrī veṁkaḍottama kām̐giliṁchidi
vaddaribāḍuna dānū naḍu sigguvaḍĕnu