మే మింతేసి కోపము మీకు మీకే యలవాటు
(॥పల్లవి॥)
మే మింతేసి కోపము మీకు మీకే యలవాటు
ఆ మొరగులెల్లా మీకు నలవాటు
(॥మేమిం॥)
కాకరిమాటలును కాఁతాళపు సాలపులు
ఆకెకు నీకు నవి యలవాటు
రాకపోక తరితీపు రచ్చలలో యెమ్మెలును
ఆకొలఁది కాకొలఁది యలవాటు
(॥మేమిం॥)
కేరి కేరి నవ్వులును కేఁకరించే సన్నలును
ఆరజము లవియే మీకలవాటు
బీరపు బొమ్మ జంకెలు బిగిసేటి ప్రియముల
నారి తేరితిరి లోలో నలవాటు
(॥మేమిం॥)
చిడుముడిమంతనాలు చిమ్మిరేఁగే పెనఁగులు
అడియాలా లెప్పడూ మీకలవాటు
యెడయక శ్రీ వేంకటేశ మమ్ము నేలితివి
అడరే మీగుణాలు మీకలవాటు
(||pallavi||)
me miṁtesi kobamu mīgu mīge yalavāḍu
ā mŏragulĕllā mīgu nalavāḍu
(||memiṁ||)
kāgarimāḍalunu kām̐tāḽabu sālabulu
āgĕgu nīgu navi yalavāḍu
rāgaboga taridību rachchalalo yĕmmĕlunu
āgŏlam̐di kāgŏlam̐di yalavāḍu
(||memiṁ||)
keri keri navvulunu kem̐kariṁche sannalunu
ārajamu laviye mīgalavāḍu
bīrabu bŏmma jaṁkĕlu bigiseḍi priyamula
nāri teridiri lolo nalavāḍu
(||memiṁ||)
siḍumuḍimaṁtanālu simmirem̐ge pĕnam̐gulu
aḍiyālā lĕppaḍū mīgalavāḍu
yĕḍayaga śhrī veṁkaḍeśha mammu nelidivi
aḍare mīguṇālu mīgalavāḍu