మే మెఱఁగమా యేమి మీ సుద్దు లిన్నియును
(॥పల్లవి॥)
మే మెఱఁగమా యేమి మీ సుద్దు లిన్నియును
ప్రేమములు దమకములు పెనగొనీ మీకు
(॥మేమె॥)
పలుకవే పతితోడ పగడవాతెరనోర
కులుకవే మచ్చికలు కొసరి కొసరి
చిలుకవే మోహములు సెలవినవ్వులతేట
నెలకొన్న వేడుకలు నీయందె కలవు
(॥మేమె॥)
చూడవే నిడువాలుసోగచూపుల నితని
ఆడవే సరసంబు లంటివుట్టి
కూడవే కాఁగిటను గుబ్బచనుఁగవనొత్తి
వాడికెలు మిగుల నీవలననే కలవు
(॥మేమె॥)
కలయవే పాన్పుపై కళలు మోమునఁ బొదల
వెలయవే రతిరాచవిభవములను
యెలమి శ్రీవేంకటేశుఁ డితఁ డిపుడె నిను నేలె
కలికి చందములు నీకతననే కలవు
(||pallavi||)
me mĕṟam̐gamā yemi mī suddu linniyunu
premamulu damagamulu pĕnagŏnī mīgu
(||memĕ||)
palugave padidoḍa pagaḍavādĕranora
kulugave machchigalu kŏsari kŏsari
silugave mohamulu sĕlavinavvuladeḍa
nĕlagŏnna veḍugalu nīyaṁdĕ kalavu
(||memĕ||)
sūḍave niḍuvālusogasūbula nidani
āḍave sarasaṁbu laṁṭivuṭṭi
kūḍave kām̐giḍanu gubbasanum̐gavanŏtti
vāḍigĕlu migula nīvalanane kalavu
(||memĕ||)
kalayave pānpubai kaḽalu momunam̐ bŏdala
vĕlayave radirāsavibhavamulanu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍibuḍĕ ninu nelĕ
kaligi saṁdamulu nīgadanane kalavu