Me meṟamga midameemda meege telusunu

మే మెఱఁగ మిటమీఁద మీకే తెలుసును
Language

(॥పల్లవి॥)
మే మెఱఁగ మిటమీఁద మీకే తెలుసును
ఆముకొన్న సుద్దులెల్ల ఆపె నడుగవయ్యా

(॥మేమె॥)
చేరఁడేసికన్నుల చెలి నిన్ను నడిగెను
వూరకే జాణతనాలే వొరశాడీని
కెరడపునవ్వులతో కేలెత్తి మొక్కె నీకు
అరసీఁ గడమసుద్దు లాపె నడుగవయ్యా

(॥మేమె॥)
కొండలంతలు చన్నుల కొమ్మ నిన్ను వెదకెను
దుండగపుమాటల దూకుచుండెను
పండు మోవితేనెలాపె పంతములు నెరపెను
అండ నేమిగికోకాని ఆపె నడుగవయ్యా

(॥మేమె॥)
చక్కనివనిత నీపైఁ జల్లె వలపులెల్లాను
పిక్కటిల్లు ప్రేమములు పెంచి పొగడె
ఇక్కువెఱఁగి శ్రీవేంకటేశ నీవు గూడితివి
అక్కజపు మేలెల్లా ఆపె నడుగవయ్యా

(||pallavi||)
me mĕṟam̐ga miḍamīm̐da mīge tĕlusunu
āmugŏnna suddulĕlla ābĕ naḍugavayyā

(||memĕ||)
seram̐ḍesigannula sĕli ninnu naḍigĕnu
vūrage jāṇadanāle vŏraśhāḍīni
kĕraḍabunavvulado kelĕtti mŏkkĕ nīgu
arasīm̐ gaḍamasuddu lābĕ naḍugavayyā

(||memĕ||)
kŏṁḍalaṁtalu sannula kŏmma ninnu vĕdagĕnu
duṁḍagabumāḍala dūgusuṁḍĕnu
paṁḍu movidenĕlābĕ paṁtamulu nĕrabĕnu
aṁḍa nemigigogāni ābĕ naḍugavayyā

(||memĕ||)
sakkanivanida nībaim̐ jallĕ valabulĕllānu
pikkaḍillu premamulu pĕṁchi pŏgaḍĕ
ikkuvĕṟam̐gi śhrīveṁkaḍeśha nīvu gūḍidivi
akkajabu melĕllā ābĕ naḍugavayyā