Me memi sedumu maagu meere dikku

మే మేమి సేతుము మాకు మీరే దిక్కు
Language

(॥పల్లవి॥)
మే మేమి సేతుము మాకు మీరే దిక్కు
చేముట్టరా దితనిఁ జిత్తగించవమ్మా

(॥మేమే॥)
వోయశోద నీకొడుకు వూరిపడుచులుఁ దాను
ఖోయని వుట్లు గొట్టీఁ గోలలఁ గొని
చాయల జోరునఁ గారీ చమరుఁ బాలుఁ బెరుగు
సోయగపు నీకన్నులఁ జూతువు రావమ్మా

(॥మేమే॥)
కొత్తజవ్వను లైనకొమ్మలచన్నులు తేనె-
దుత్తలంటా పొందించ దొరకొనీని
మొత్తములై యున్నారు ముంగిళ్ళనెల్లాఁ దామే
గుత్తముగ నీవే కనుఁగొందువు రావమ్మా

(॥మేమే॥)
చే రలమేల్మంగఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద
వీరుఁడె వాఁడె యేఁగీని వీది వీథుల
కూరిమి మేము నవ్వితే గుట్టున సన్నలు సేసీ
తేరకొన యిది నీవే తిలకించవమ్మా

(||pallavi||)
me memi sedumu māgu mīre dikku
semuṭṭarā didanim̐ jittagiṁchavammā

(||meme||)
voyaśhoda nīgŏḍugu vūribaḍusulum̐ dānu
khoyani vuṭlu gŏṭṭīm̐ golalam̐ gŏni
sāyala jorunam̐ gārī samarum̐ bālum̐ bĕrugu
soyagabu nīgannulam̐ jūduvu rāvammā

(||meme||)
kŏttajavvanu lainagŏmmalasannulu tenĕ-
duttalaṁṭā pŏṁdiṁcha dŏragŏnīni
mŏttamulai yunnāru muṁgiḽḽanĕllām̐ dāme
guttamuga nīve kanum̐gŏṁduvu rāvammā

(||meme||)
se ralamelmaṁgam̐ gūḍi śhrīveṁkaḍādrimīm̐da
vīrum̐ḍĕ vām̐ḍĕ yem̐gīni vīdi vīthula
kūrimi memu navvide guṭṭuna sannalu sesī
teragŏna yidi nīve tilagiṁchavammā