Me lerimgi melamgide metturu ninnimtulellaa

మే లెరిఁగి మెలఁగితే మెత్తురు నిన్నింతులెల్లా
Language

(॥పల్లవి॥)
మే లెరిఁగి మెలఁగితే మెత్తురు నిన్నింతులెల్లా
పోలించి పోలించి వలపులు నించుకోవయా

(॥మేలె॥)
పిలుచుకవచ్చి నీకుఁ బీఁటవెట్టి విడెమిచ్చి
చెలి చుట్టరికాలెల్లాఁ జేసె నీకును
మలయుచు యీ మేలు మరవక యేపొద్దూ
తలఁచుక తలఁచుక తమిరేఁచుకోవయా

(॥మేలె॥)
మంతానానఁ బాదాలొత్తి మాఁటలాడి విందుపెట్టి
కాంత వుపచారాలెల్లాఁ గావించె నీకు
దొంతిఁ బెట్టి యీ బత్తి తోడఁదోడ దాఁచుకొని
సంతోసించి సంతోసించి చవిసేసుకోవయ్యా

(॥మేలె॥)
కదిసి చన్నుల నొత్తి కాఁగిలించి చొక్కించి
సుదతి ఇచ్చకాలెల్లాఁ జూపె నీకును
ఇదవో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నాకెఁ
బొదిగి పొదిగి కొంత పోది సేసుకోవయ్యా

(||pallavi||)
me lĕrim̐gi mĕlam̐gide mĕtturu ninniṁtulĕllā
poliṁchi poliṁchi valabulu niṁchugovayā

(||melĕ||)
pilusugavachchi nīgum̐ bīm̐ṭavĕṭṭi viḍĕmichchi
sĕli suṭṭarigālĕllām̐ jesĕ nīgunu
malayusu yī melu maravaga yebŏddū
talam̐suga talam̐suga tamirem̐sugovayā

(||melĕ||)
maṁtānānam̐ bādālŏtti mām̐ṭalāḍi viṁdubĕṭṭi
kāṁta vubasārālĕllām̐ gāviṁchĕ nīgu
dŏṁtim̐ bĕṭṭi yī batti toḍam̐doḍa dām̐sugŏni
saṁtosiṁchi saṁtosiṁchi savisesugovayyā

(||melĕ||)
kadisi sannula nŏtti kām̐giliṁchi sŏkkiṁchi
sudadi ichchagālĕllām̐ jūbĕ nīgunu
idavo śhrīveṁkaḍeśha yelidivi nannu nāgĕm̐
bŏdigi pŏdigi kŏṁta podi sesugovayyā