Me leṟimgi javaraali mechchavaddaa

మే లెఱిఁగి జవరాలి మెచ్చవద్దా
Language

(॥పల్లవి॥)
మే లెఱిఁగి జవరాలి మెచ్చవద్దా
జాలిఁబడి నీ వేల జంకించేవయ్యా

(॥॥)
చెక్కుల నీ చెమటలు చేతఁ దుడిచితేను
చక్కని రమణి నేల సాదించేవయ్యా
నెక్కొని వీడియున్న నీ తురుము ముడిచితే
నిక్కువలు మోవఁగా నేల తిట్టేవయ్యా

(॥॥)
ప్రేమ తోడ నీకు దప్పికిఁ బన్నీరిచ్చితేను
కోమలపు సతినేల గుంప్పించేవయ్యా
నీమేని కలపు దీర నిండా గందము పూసితే
ఆముక సిగ్గున నేల అదలించేవయ్యా

(॥॥)
పై కొన్న నీ నిద్దురకుఁ బానుపు వరిచితేను
శ్రీ కాంత చన్నులేల పిసికేవయ్యా
యీకడ శ్రీ వేంకటేశ యీకె నిట్టే కూడితివి
జోకైన రతుల నెంత చొక్కించేవయ్యా

(||pallavi||)
me lĕṟim̐gi javarāli mĕchchavaddā
jālim̐baḍi nī vela jaṁkiṁchevayyā

(||||)
sĕkkula nī sĕmaḍalu sedam̐ duḍisidenu
sakkani ramaṇi nela sādiṁchevayyā
nĕkkŏni vīḍiyunna nī turumu muḍiside
nikkuvalu movam̐gā nela tiṭṭevayyā

(||||)
prema toḍa nīgu dappigim̐ bannīrichchidenu
komalabu sadinela guṁppiṁchevayyā
nīmeni kalabu dīra niṁḍā gaṁdamu pūside
āmuga sigguna nela adaliṁchevayyā

(||||)
pai kŏnna nī nidduragum̐ bānubu varisidenu
śhrī kāṁta sannulela pisigevayyā
yīgaḍa śhrī veṁkaḍeśha yīgĕ niṭṭe kūḍidivi
jogaina radula nĕṁta sŏkkiṁchevayyā