మట్టుమీరి మెలఁగితే మరేమున్నది
(॥పల్లవి॥)
మట్టుమీరి మెలఁగితే మరేమున్నది
చుట్టరిక మెరిఁగిన సూటికత్తెలకును
(॥మట్టు॥)
ప్రియముచెప్పుట మేలు బిగియకుండుట మేలు
నయగారిసతికిని నాథునితోను
క్రియతో మాటాడవలె కినియకుండఁగవలె
నియతమైనయట్టినెలఁతలకు
(॥మట్టు॥)
చెప్పినట్టు సేయఁదగు చేతికి లోనుగాఁదగు
తప్పనిమగువకును తనపతితో
చొప్పెరిఁగి నవ్వుటొప్పు సొలయకుండుట యొప్పు
ముప్పిరి గొనఁగఁ గడుమోహించినవారికి
(॥మట్టు॥)
కొలువుసేయుట పాడి కూరిమిచల్లుట పాడి
కలికియైనచెలికి కాంతునితోను
నెలవై శ్రీవేంకటేశ నిన్నలమేల్ మంగ గూడె
యెలమి నిదేబుద్ది యిల్లాండ్లకును
(||pallavi||)
maṭṭumīri mĕlam̐gide maremunnadi
suṭṭariga mĕrim̐gina sūḍigattĕlagunu
(||maṭṭu||)
priyamusĕppuḍa melu bigiyaguṁḍuḍa melu
nayagārisadigini nāthunidonu
kriyado māḍāḍavalĕ kiniyaguṁḍam̐gavalĕ
niyadamainayaṭṭinĕlam̐talagu
(||maṭṭu||)
sĕppinaṭṭu seyam̐dagu sedigi lonugām̐dagu
tappanimaguvagunu tanabadido
sŏppĕrim̐gi navvuḍŏppu sŏlayaguṁḍuḍa yŏppu
muppiri gŏnam̐gam̐ gaḍumohiṁchinavārigi
(||maṭṭu||)
kŏluvuseyuḍa pāḍi kūrimisalluḍa pāḍi
kaligiyainasĕligi kāṁtunidonu
nĕlavai śhrīveṁkaḍeśha ninnalamel maṁga gūḍĕ
yĕlami nidebuddi yillāṁḍlagunu