Mattumeeram jaalaga nemaanidim gaaga

మట్టుమీరఁ జాలక నేమానితిఁ గాక
Language

(॥పల్లవి॥)
మట్టుమీరఁ జాలక నేమానితిఁ గాక - నీకు
దిట్టతన మపుడు నేఁ దెచ్చి పెట్టవచ్చునా

(॥మట్టు॥)
కన్నుల మొక్కఁగ నిన్నుఁ గాదనఁగ రాదుగాక
నిన్న నీవు రాకున్నదే నేరమిగాదా
అన్నిటా నేనందుకే అలిగితేఁ గనక ని-
చిన్నఁబోయిన విధము చెప్పి చూపవచ్చునా

(॥మట్టు॥)
అట్టె నీ వానవెట్టఁగ నది దోయరాదు గాక
నెట్టన నీ మేనికాఁకే నేరమి గాదా
బెట్టుగా నీ వాడేవి పెంచితేఁ గనక నీ-
పట్టరానితమకము భావించవచ్చునా

(॥మట్టు॥)
వూరకే నీవు గూడఁగా నొద్దనఁగరాదు గాక
నీరచన లిన్నియును నేరమిగాదా
యేరా శ్రీవేంకటేశ యేకమైతేఁగాక నిన్ను
దూరి యాడితే మోము తొంగిచూడవచ్చునా

(||pallavi||)
maṭṭumīram̐ jālaga nemānidim̐ gāga - nīgu
diṭṭadana mabuḍu nem̐ dĕchchi pĕṭṭavachchunā

(||maṭṭu||)
kannula mŏkkam̐ga ninnum̐ gādanam̐ga rādugāga
ninna nīvu rāgunnade neramigādā
anniḍā nenaṁduge aligidem̐ ganaga ni-
sinnam̐boyina vidhamu sĕppi sūbavachchunā

(||maṭṭu||)
aṭṭĕ nī vānavĕṭṭam̐ga nadi doyarādu gāga
nĕṭṭana nī menigām̐ke nerami gādā
bĕṭṭugā nī vāḍevi pĕṁchidem̐ ganaga nī-
paṭṭarānidamagamu bhāviṁchavachchunā

(||maṭṭu||)
vūrage nīvu gūḍam̐gā nŏddanam̐garādu gāga
nīrasana linniyunu neramigādā
yerā śhrīveṁkaḍeśha yegamaidem̐gāga ninnu
dūri yāḍide momu tŏṁgisūḍavachchunā