మట్టుమీర నేమిటికి మాకు నీసేవే చాలు
(॥పల్లవి॥)
మట్టుమీర నేమిటికి మాకు నీసేవే చాలు
చుట్టాలమే యెట్టుండినా సొరిది నీ కెపుడు
(॥మట్టు॥)
చిల్లర పొందులెల్లాను జీరలై నీమేన నంటె
వెల్లవిరిఁ దుడిచితే వెసఁబోవునా
పల్లదాన నాకొంగు పట్టేవు నీవప్పటిని
వల్లమయ్యీ అంటించుకోనోపము నీమేనివి
(॥మట్టు॥)
కిమ్ములవారి మాటలు కెంపులై నీమోవి నంటె
అమ్మరో యెంతదాఁచినా నణఁగుండీనా
చిమ్ముచు మాతో నీవు చేరి నవ్వే వప్పటిని
వొమ్మునా మాకింతేసి నీవొళ్లిసింగారములు
(॥మట్టు॥)
చిత్తజరతు లేడవో చెమటలై మేనఁగారీ
వొత్తి యెంతదుడిచినా వూరకుండీనా
ఇత్తల శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
వుత(త్త?) కువై వుండీనా నీవొడ్డినయాలసలకు
(||pallavi||)
maṭṭumīra nemiḍigi māgu nīseve sālu
suṭṭālame yĕṭṭuṁḍinā sŏridi nī kĕbuḍu
(||maṭṭu||)
sillara pŏṁdulĕllānu jīralai nīmena naṁṭĕ
vĕllavirim̐ duḍiside vĕsam̐bovunā
palladāna nāgŏṁgu paṭṭevu nīvappaḍini
vallamayyī aṁṭiṁchugonobamu nīmenivi
(||maṭṭu||)
kimmulavāri māḍalu kĕṁpulai nīmovi naṁṭĕ
ammaro yĕṁtadām̐sinā naṇam̐guṁḍīnā
simmusu mādo nīvu seri navve vappaḍini
vŏmmunā māgiṁtesi nīvŏḽlisiṁgāramulu
(||maṭṭu||)
sittajaradu leḍavo sĕmaḍalai menam̐gārī
vŏtti yĕṁtaduḍisinā vūraguṁḍīnā
ittala śhrīveṁkaḍeśha iḍu nannu nelidivi
vuda(tta?) kuvai vuṁḍīnā nīvŏḍḍinayālasalagu