మట్టుతో నుండుటే మేలు మగువలకు
(॥పల్లవి॥)
మట్టుతో నుండుటే మేలు మగువలకు
యిట్టె విభుని తోడ నిచ్చకమే యాడవే
(॥॥)
కూరిమి గల పతిని కొసరఁగఁ బోదురా
సారమైన వలపెల్లాఁ జప్పఁ జేతురా
గారవపుఁ జుట్టము తోఁ గడఁగి పెనఁగుదురా
కారుకమ్మే సరసాలు కరకరి సేతురా
(॥॥)
మరిగిన చెలి కాని మనసు సోదింతురా
గరిమల వేడుకలు కాకుసేతురా
యెరవు లేని చోట యెగ్గులు వట్టుదురా
నిరతపు పొందులలో నెరు సేరఁ బోదురా
(॥॥)
శ్రీ వేంకటేశ్వరుఁ గూడి చెక్కులు నొక్కుదురా
భావించలమేల్మంగవు పదరుదురా
వే వేలు రతులలో వెస నలయింతురా
చేవ దేర నవ్వు నవ్వి సిగ్గులు పడుదురా
(||pallavi||)
maṭṭudo nuṁḍuḍe melu maguvalagu
yiṭṭĕ vibhuni toḍa nichchagame yāḍave
(||||)
kūrimi gala padini kŏsaram̐gam̐ bodurā
sāramaina valabĕllām̐ jappam̐ jedurā
gāravabum̐ juṭṭamu tom̐ gaḍam̐gi pĕnam̐gudurā
kārugamme sarasālu karagari sedurā
(||||)
marigina sĕli kāni manasu sodiṁturā
garimala veḍugalu kāgusedurā
yĕravu leni soḍa yĕggulu vaṭṭudurā
niradabu pŏṁdulalo nĕru seram̐ bodurā
(||||)
śhrī veṁkaḍeśhvarum̐ gūḍi sĕkkulu nŏkkudurā
bhāviṁchalamelmaṁgavu padarudurā
ve velu radulalo vĕsa nalayiṁturā
seva dera navvu navvi siggulu paḍudurā