(॥పల్లవి॥)
మట్టు మీరిన చేతల మగవాడవు
వట్టి సత్తేలు నెరప వలెనా నీకు
(॥మట్టు॥)
అంగన నీవును మాట లాడుతా నుండగ జూచి
అంగవించి పొందు గద్దొ యని వుంటిమి
నింగి మోవ నాన లెల్ల నీ వేల పెట్టుకొనేవు
చెంగట దోసమా నీకు జెల్లదా యేమి
(॥మట్టు॥)
పొలతి నీ వొకవీధిఁ బొలసి నడవఁ గాను
అలరిన నీసమ్మంధ మని వుంటిమి
తెలపు మనుచు నేల తీసేవు నాకోంగు వట్టి
తలఁచ నాపెకు నీకుఁ దగదా యేమి
(॥మట్టు॥)
యింతియును నీవును నేకతాన నుండఁ జూచి
అంతలో నీవు గూడితి వని యుంటిమి
వంతకు శ్రీవెంకటేశ వడి నలమేలుమంగ
నింతటఁ గూడితివి నీ వెగఁరవా యేమి
(||pallavi||)
maṭṭu mīrina sedala magavāḍavu
vaṭṭi sattelu nĕraba valĕnā nīgu
(||maṭṭu||)
aṁgana nīvunu māḍa lāḍudā nuṁḍaga jūsi
aṁgaviṁchi pŏṁdu gaddŏ yani vuṁṭimi
niṁgi mova nāna lĕlla nī vela pĕṭṭugŏnevu
sĕṁgaḍa dosamā nīgu jĕlladā yemi
(||maṭṭu||)
pŏladi nī vŏgavīdhim̐ bŏlasi naḍavam̐ gānu
alarina nīsammaṁdha mani vuṁṭimi
tĕlabu manusu nela tīsevu nāgoṁgu vaṭṭi
talam̐sa nābĕgu nīgum̐ dagadā yemi
(||maṭṭu||)
yiṁtiyunu nīvunu negadāna nuṁḍam̐ jūsi
aṁtalo nīvu gūḍidi vani yuṁṭimi
vaṁtagu śhrīvĕṁkaḍeśha vaḍi nalamelumaṁga
niṁtaḍam̐ gūḍidivi nī vĕgam̐ravā yemi