Maruni sampadalunu maguva simgaaramunu

మరుని సంపదలును మగువ సింగారమును
Language

(॥పల్లవి॥)
మరుని సంపదలును మగువ సింగారమును
పొరిఁబొరి నిపు డొక్కపొత్తు గూడఁబోలును

(॥మరు॥)
చెలియచిరునవ్వులఁ జిక్కనివెన్నెలు గాసి
కలువలు వెదచల్లీఁ గనుచూపుల
అలులు మూఁకలు గూడీ నంగనతురుమునను
పొలసి యన్నియు నొక్కపుట్టువుగాఁబోలును

(॥మరు॥)
మొక్కలానఁ జివురులు మోమిమీఁద జాజుకొనీ
జక్కవలు పాదుకొనీఁ జన్నులమీఁద
నిక్కెవడి సంపెంగ నెలఁత నాసికమున
నొక్కజాతేకాఁబోలు నొనగూడియున్నవి

(॥మరు॥)
అమరి పాదములకు నటు తామరలు మొక్కె
తిమురుచుఁ బిరుఁదున తేరు నిలిచె
తమి శ్రీవేంకటేశుఁడు తరుణి యలమేల్మంగ
జవళిఁ గూడిరి వొక్కజంటగాఁ బోలును

(||pallavi||)
maruni saṁpadalunu maguva siṁgāramunu
pŏrim̐bŏri nibu ḍŏkkabŏttu gūḍam̐bolunu

(||maru||)
sĕliyasirunavvulam̐ jikkanivĕnnĕlu gāsi
kaluvalu vĕdasallīm̐ ganusūbula
alulu mūm̐kalu gūḍī naṁganadurumunanu
pŏlasi yanniyu nŏkkabuṭṭuvugām̐bolunu

(||maru||)
mŏkkalānam̐ jivurulu momimīm̐da jājugŏnī
jakkavalu pādugŏnīm̐ jannulamīm̐da
nikkĕvaḍi saṁpĕṁga nĕlam̐ta nāsigamuna
nŏkkajādegām̐bolu nŏnagūḍiyunnavi

(||maru||)
amari pādamulagu naḍu tāmaralu mŏkkĕ
timurusum̐ birum̐duna teru nilisĕ
tami śhrīveṁkaḍeśhum̐ḍu taruṇi yalamelmaṁga
javaḽim̐ gūḍiri vŏkkajaṁṭagām̐ bolunu