Maruni balamulellaa maguvagum juttaale

మరుని బలములెల్లా మగువకుఁ జుట్టాలే
Language

(॥పల్లవి॥)
మరుని బలములెల్లా మగువకుఁ జుట్టాలే
విరహ మెన్నఁడూ లేదు వెలఁదికి నీకును

(॥మరు॥)
చెలులతో నీసుద్దులు చెప్పికోఁగా వనములో
చిలుకలు చేరవచ్చెఁ జెలివద్దకి
చెలరేఁగి చన్నులపై చెమట లారుచుకోఁగా
వలవంత నురముపై వాలెను జక్కవలు

(॥మరు॥)
కమ్మర నిన్నుఁ దలఁచి కరముల మొక్కితేను
తుమ్మిదలు వాలఁజొచ్చె తొయ్యలిమీఁద
యిమ్ముల నీ వున్నచోటి కేఁగు దేరఁగాఁ జూచి
దొమ్మిగూడి మయూరాలు తోడురాఁ దొడఁగె

(॥మరు॥)
ముచ్చట నిన్నుఁ బెండ్లాడి మోము దప్పక చూఁడఁగా
కచ్చుపెట్టి చకోరాలు కాంతపై నిండె
యిచ్చట శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
కొచ్చి నీతో మాటాడఁగా కోవిలలు పాడెను

(||pallavi||)
maruni balamulĕllā maguvagum̐ juṭṭāle
viraha mĕnnam̐ḍū ledu vĕlam̐digi nīgunu

(||maru||)
sĕlulado nīsuddulu sĕppigom̐gā vanamulo
silugalu seravachchĕm̐ jĕlivaddagi
sĕlarem̐gi sannulabai sĕmaḍa lārusugom̐gā
valavaṁta nuramubai vālĕnu jakkavalu

(||maru||)
kammara ninnum̐ dalam̐si karamula mŏkkidenu
tummidalu vālam̐jŏchchĕ tŏyyalimīm̐da
yimmula nī vunnasoḍi kem̐gu deram̐gām̐ jūsi
dŏmmigūḍi mayūrālu toḍurām̐ dŏḍam̐gĕ

(||maru||)
muchchaḍa ninnum̐ bĕṁḍlāḍi momu dappaga sūm̐ḍam̐gā
kachchubĕṭṭi sagorālu kāṁtabai niṁḍĕ
yichchaḍa śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
kŏchchi nīdo māḍāḍam̐gā kovilalu pāḍĕnu