మరుని బలాలమీఁద మనకేల వైరము
(॥పల్లవి॥)
మరుని బలాలమీఁద మనకేల వైరము
పరగఁ గూడినమీఁద పగ యెంచఁదగదు
(॥మరు॥)
తుమ్మిదలఁ బోల్చితే తొయ్యలికొప్పు నెరులు
తెమ్మలుగా పువుటమ్ములతేనెలు దాగు
తమ్మిరేకులఁ బోలుచఁదగు కాంతకన్నులు
నెమ్మి నావేళఁ జంద్రుఁడు నిలువరా దెదుట
(॥మరు॥)
ధర గొండలఁ బోల్చితే తరుణి చన్నుఁగవ నేఁ-
డిరవై గాలి మెలఁగ నెడమియ్యదు
కరికుంభాల చెలిపిరుఁదు వోలిచితేను
సరిఁ జెఱకువిల్లని చప్పరించును
(॥మరు॥)
అతివను బంగారుబొమ్మని తగఁబోల్చితేను
ఇతవై మన్మథకళ లీపెనే చేరు
ఇతఁడు శ్రీవేంకటేశుఁ డీలేమ యలమేల్మంగ
మతి నిద్దరిఁబోలితే మదనుని గెల్తురు
(||pallavi||)
maruni balālamīm̐da managela vairamu
paragam̐ gūḍinamīm̐da paga yĕṁcham̐dagadu
(||maru||)
tummidalam̐ bolside tŏyyaligŏppu nĕrulu
tĕmmalugā puvuḍammuladenĕlu dāgu
tammiregulam̐ bolusam̐dagu kāṁtagannulu
nĕmmi nāveḽam̐ jaṁdrum̐ḍu niluvarā dĕduḍa
(||maru||)
dhara gŏṁḍalam̐ bolside taruṇi sannum̐gava nem̐-
ḍiravai gāli mĕlam̐ga nĕḍamiyyadu
kariguṁbhāla sĕlibirum̐du volisidenu
sarim̐ jĕṟaguvillani sappariṁchunu
(||maru||)
adivanu baṁgārubŏmmani tagam̐bolsidenu
idavai manmathagaḽa lībĕne seru
idam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍīlema yalamelmaṁga
madi niddarim̐bolide madanuni gĕlduru