మరుఁడు సేసినయట్టి మాయ లివి
(॥పల్లవి॥)
మరుఁడు సేసినయట్టి మాయ లివి
కరఁగె మే నిందు లోనుగాకుండ వచ్చునా
(॥మరుఁ॥)
తరుణినీపతిఁ బాసి తమకాన బడలవు
విరహ మిందరి కొకవిధమేకాదా
పెడరేఁచి కూరిములు పెట్టినపాట్లనెల్లాఁ
బొరలక మన కవి పొంతఁ దోయవచ్చునా
(॥మరుఁ॥)
నెవ్వగఁ జిత్తములోన నీకేల చింతింప
జవ్వన మిందరి కొకసరిగాదా
యెవ్వరేకాలమునందు యెట్టుండవలె నట్టు
దవ్వుచేరువలు నమ్మి తప్పించవచ్చునా
(॥మరుఁ॥)
చెక్కిటిచేతితోడ చెలులపై నొరగేవు
చక్కఁదన మిందరికి జయమేకాదా
యెక్కువతో శ్రీవేంకటేశు డిదె నిన్నుఁగూడె
కక్కసమేఁటికి నిఁకఁ గాదనగవచ్చునా
(||pallavi||)
marum̐ḍu sesinayaṭṭi māya livi
karam̐gĕ me niṁdu lonugāguṁḍa vachchunā
(||marum̐||)
taruṇinībadim̐ bāsi tamagāna baḍalavu
viraha miṁdari kŏgavidhamegādā
pĕḍarem̐si kūrimulu pĕṭṭinabāṭlanĕllām̐
bŏralaga mana kavi pŏṁtam̐ doyavachchunā
(||marum̐||)
nĕvvagam̐ jittamulona nīgela siṁtiṁpa
javvana miṁdari kŏgasarigādā
yĕvvaregālamunaṁdu yĕṭṭuṁḍavalĕ naṭṭu
davvuseruvalu nammi tappiṁchavachchunā
(||marum̐||)
sĕkkiḍisedidoḍa sĕlulabai nŏragevu
sakkam̐dana miṁdarigi jayamegādā
yĕkkuvado śhrīveṁkaḍeśhu ḍidĕ ninnum̐gūḍĕ
kakkasamem̐ṭigi nim̐kam̐ gādanagavachchunā