మరుఁడు సేసిన మాయ మగలకు నాండ్లకు
(॥పల్లవి॥)
మరుఁడు సేసిన మాయ మగలకు నాండ్లకు
విరసాలు వుట్టవు వేడుకే కాని
(॥॥)
యెంత దూరి మాటాడినా యింపు లయ్యే వుండుఁగాని
పంతము రేఁగ దింతిపైఁ బతికి
పొంతనుండి సారె సారె బొమ్మల జంకించినాను
వింతలు దోఁచవు మరి వేడుకే కాని
(॥॥)
చలపట్టి సరసము జరయుచు నాడినాను
అలయిక వుట్టదు దేహమునకును
పెలుచుఁ దనాన మరి పెనఁగులా టాడినాను
వెలయ వేసటగాదు వేడుకేకాని
(॥॥)
మిన్నక కొసరి మందె మేళ మెంత సేసినాను
అన్నిటా లోలో నెగ్గులై మించవు
యెన్నఁగ శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
విన్నప్పుడే కూడె మాకు వేడుకలె కాని
(||pallavi||)
marum̐ḍu sesina māya magalagu nāṁḍlagu
virasālu vuṭṭavu veḍuge kāni
(||||)
yĕṁta dūri māḍāḍinā yiṁpu layye vuṁḍum̐gāni
paṁtamu rem̐ga diṁtibaim̐ badigi
pŏṁtanuṁḍi sārĕ sārĕ bŏmmala jaṁkiṁchinānu
viṁtalu dom̐savu mari veḍuge kāni
(||||)
salabaṭṭi sarasamu jarayusu nāḍinānu
alayiga vuṭṭadu dehamunagunu
pĕlusum̐ danāna mari pĕnam̐gulā ṭāḍinānu
vĕlaya vesaḍagādu veḍugegāni
(||||)
minnaga kŏsari maṁdĕ meḽa mĕṁta sesinānu
anniḍā lolo nĕggulai miṁchavu
yĕnnam̐ga śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
vinnappuḍe kūḍĕ māgu veḍugalĕ kāni