Marum deda nunna vaamde manasu lobalam gaana

మరుఁ డేడ నున్న వాఁడె మనసు లోపలఁ గాన
Language

(॥పల్లవి॥)
మరుఁ డేడ నున్న వాఁడె మనసు లోపలఁ గాన
తొరల నే విన్నవించి దూరే నంటేను

(॥మరుఁ॥)
వలపు చెప్పఁగరాదు వయసు పైఁబూయరాదు
యెలమి నాతనికైతే నెఱుకలేదు
చెలు లాడనే వున్నారు చింతతో నుందాన నీడ
బలువిహపుటేరు పారీ నడుమను

(॥మరుఁ॥)
ననుపు పైఁ జల్లరాదు నవ్వు వెదవెట్టరాదు
తనిని యీవిచార మాతనికి లేదు
వినుకలి పతి కందు వెరగుట నా కిందు
పనిలేనిమాటలేరు పారీ నడుమను

(॥మరుఁ॥)
కూటమి మీఁదెత్తరాదు కోరికలు చుట్టరాదు
నేఁటితో నాతని కిన్ని నేరుపరాదు
కూటువఁ దా విచ్చేసి కూడె శ్రీ వేంకటేశుఁడు
పాటించి చెమటలేరు పారీ నడుమును

(||pallavi||)
marum̐ ḍeḍa nunna vām̐ḍĕ manasu lobalam̐ gāna
tŏrala ne vinnaviṁchi dūre naṁṭenu

(||marum̐||)
valabu sĕppam̐garādu vayasu paim̐būyarādu
yĕlami nādanigaide nĕṟugaledu
sĕlu lāḍane vunnāru siṁtado nuṁdāna nīḍa
baluvihabuḍeru pārī naḍumanu

(||marum̐||)
nanubu paim̐ jallarādu navvu vĕdavĕṭṭarādu
tanini yīvisāra mādanigi ledu
vinugali padi kaṁdu vĕraguḍa nā kiṁdu
panilenimāḍaleru pārī naḍumanu

(||marum̐||)
kūḍami mīm̐dĕttarādu korigalu suṭṭarādu
nem̐ṭido nādani kinni nerubarādu
kūḍuvam̐ dā vichchesi kūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu
pāḍiṁchi sĕmaḍaleru pārī naḍumunu