మరులుకొలుపఁ జోటులేదు మాకు బొంక నెడము లేదు
(॥పల్లవి॥)
మరులుకొలుపఁ జోటులేదు మాకు బొంక నెడము లేదు
సరస నాయకుఁడవు నీకు చందమాయఁగా
(॥మరు॥)
కరఁగి కరఁగి చెలియ పేరు కలవరించి నుడుగువంక
మరిగినట్టిపొందులౌత మాకుఁ దెలిసెఁగా
వెర వెఱుఁగకుండువంక వింత లాలకించువంక
తరతరంబుఁ బాయరానితగులు దెలిసెఁగా
(॥మరు॥)
నిలిచి నిలిచి చొక్కువంక నీలోనినవ్వువంక
చెలికి మేలువాఁడీవౌతా చెలువు మిగిలెఁగా
పలికి పలికి భ్రమయువంక బహుపరాకులైనవంక
కలిగినంత మోహమెల్లఁ గాన వచ్చెఁగా
(॥మరు॥)
ఇట్టునట్టుఁ జూచువంక యేకతాన నుండువంక
అట్టె చెలియఁ గూడురతుల ఆస దెలిసెఁగా
పెట్టుకొన్న సేసవంక పండ్లి శ్రీవేంకటేశ
గట్టిగాఁగ సతికి నీకుఁ గలుగు టాయఁగా
(||pallavi||)
marulugŏlubam̐ joḍuledu māgu bŏṁka nĕḍamu ledu
sarasa nāyagum̐ḍavu nīgu saṁdamāyam̐gā
(||maru||)
karam̐gi karam̐gi sĕliya peru kalavariṁchi nuḍuguvaṁka
mariginaṭṭibŏṁdulauda māgum̐ dĕlisĕm̐gā
vĕra vĕṟum̐gaguṁḍuvaṁka viṁta lālagiṁchuvaṁka
taradaraṁbum̐ bāyarānidagulu dĕlisĕm̐gā
(||maru||)
nilisi nilisi sŏkkuvaṁka nīloninavvuvaṁka
sĕligi meluvām̐ḍīvaudā sĕluvu migilĕm̐gā
paligi paligi bhramayuvaṁka bahubarāgulainavaṁka
kaliginaṁta mohamĕllam̐ gāna vachchĕm̐gā
(||maru||)
iṭṭunaṭṭum̐ jūsuvaṁka yegadāna nuṁḍuvaṁka
aṭṭĕ sĕliyam̐ gūḍuradula āsa dĕlisĕm̐gā
pĕṭṭugŏnna sesavaṁka paṁḍli śhrīveṁkaḍeśha
gaṭṭigām̐ga sadigi nīgum̐ galugu ṭāyam̐gā