Marulu deliviyunaaya maadalaina naadare

మరులు దెలివియునాయ మాటలైన నాడరే
Language

(॥పల్లవి॥)
మరులు దెలివియునాయ మాటలైన నాడరే
అరమోడ్పుఁ గన్నులనే లలసీఁ జెలియ

(॥మరు॥)
తరుణిమై చెమరించె తలఁపెందు నున్నదో
విరహపుఁజింతలలో వెదకీని
కురులెల్ల నెరివిచ్చె గుణ మెందు దాఁగెనో
పరవశములోఁ జిక్కి భావించీ నిదివో

(॥మరు॥)
చెక్కులెల్లఁ బులకించె చిత్తమేమిసేసెనో
మొక్కుల శిరసువంచి మొరసీని
ముక్కున నూర్పులు ముంచె ముందు నేమి గాఁగలదో
నీకుఁ గుచగిరులతో నిలువీఁదీ నదివో

(॥మరు॥)
సిగ్గులెల్ల నుడివోయ చేఁత లింక నేఁటివో
కగ్గని శ్రీవేంకటేశు కాఁగిటిలోన
అగ్గపువేడుక లబ్బె సంగనవోముఫలాన
తగ్గుమొగ్గులెల్లాఁదీరి తమకించీ నిదివో

(||pallavi||)
marulu dĕliviyunāya māḍalaina nāḍare
aramoḍpum̐ gannulane lalasīm̐ jĕliya

(||maru||)
taruṇimai sĕmariṁchĕ talam̐pĕṁdu nunnado
virahabum̐jiṁtalalo vĕdagīni
kurulĕlla nĕrivichchĕ guṇa mĕṁdu dām̐gĕno
paravaśhamulom̐ jikki bhāviṁchī nidivo

(||maru||)
sĕkkulĕllam̐ bulagiṁchĕ sittamemisesĕno
mŏkkula śhirasuvaṁchi mŏrasīni
mukkuna nūrbulu muṁchĕ muṁdu nemi gām̐galado
nīgum̐ gusagirulado niluvīm̐dī nadivo

(||maru||)
siggulĕlla nuḍivoya sem̐ta liṁka nem̐ṭivo
kaggani śhrīveṁkaḍeśhu kām̐giḍilona
aggabuveḍuga labbĕ saṁganavomuphalāna
taggumŏggulĕllām̐dīri tamagiṁchī nidivo