Marudamtramulalona maramgemtigi

మరుతంత్రములలోన మరఁగేఁటికి
Language

(॥పల్లవి॥)
మరుతంత్రములలోన మరఁగేఁటికి
శిరసు వంచి మొక్కేను చెప్పరే యాతనికి

(॥॥)
తమి యేలరేఁచినే తరితీపేల సేసీనే
సముకాన నున్నదానఁ జనవరిని
కొమరె వయసుదానఁ గుదురుకొనె వలపు
చెమటలు మేననిండెఁ జెప్పరే యాతనికి

(॥॥)
సెలవినేల నవ్వీనే సిగ్గులేల నెరపీనే
చెలిమి చేసినదాన సేవచేసేను
నలుగడ నివ్వెరగై నామనసు తనకె
సెలవు సేసితినని చెప్పరే యాతనికి

(॥॥)
సన్నలేల సేసీనే చన్నులేల పిసికీనే
వున్నతిఁ దనకాఁగిట కున్నదానను
యిన్నిటా శ్రీ వేంకటాశుఁ డింత లోఁదా నన్నునేలె
చెన్నగునాసంతోసము చెప్పరే యాతనికి

(||pallavi||)
marudaṁtramulalona maram̐gem̐ṭigi
śhirasu vaṁchi mŏkkenu sĕppare yādanigi

(||||)
tami yelarem̐sine taridībela sesīne
samugāna nunnadānam̐ janavarini
kŏmarĕ vayasudānam̐ gudurugŏnĕ valabu
sĕmaḍalu menaniṁḍĕm̐ jĕppare yādanigi

(||||)
sĕlavinela navvīne siggulela nĕrabīne
sĕlimi sesinadāna sevasesenu
nalugaḍa nivvĕragai nāmanasu tanagĕ
sĕlavu sesidinani sĕppare yādanigi

(||||)
sannalela sesīne sannulela pisigīne
vunnadim̐ danagām̐giḍa kunnadānanu
yinniḍā śhrī veṁkaḍāśhum̐ ḍiṁta lom̐dā nannunelĕ
sĕnnagunāsaṁtosamu sĕppare yādanigi