Marmamule verugaani manasu lokkade po

మర్మములే వేరుగాని మనసు లొక్కటే పో
Language

(॥పల్లవి॥)
మర్మములే వేరుగాని మనసు లొక్కటే పో
కూర్ములే వింతలుగాని గుణము లొక్కటే పో

(॥మర్మ॥)
రెప్పలే యడ్డముగాని రేపుమాపు మీలోన
కప్పి చూపులు కలసికనిపించుఁబో
అప్పటి గుచగిరులే అఁ నేటియడ్డముగాని
వొప్పగుఁగాఁగిలి సదా వొక్కటియాయఁబొ

(॥మర్మ॥)
మోవులే యడ్డము గాని ముంపుమోవితీపుతేనె
తోవల నొకటొకటి తొరలించెఁబో
యీవల మేను మేను ఇవి రెండింతేకాని
సావధాన మిద్దరికి సమరతే పో

(॥మర్మ॥)
రేకలే పెక్కులుగాని రెట్టించి ఇద్దరికి
యీకడ మరుగురుతు లి వొక్కటేపో
చేకొను శ్రీవేంకటేశు చెంత నలమేలుమంగ
పైకొనుమోహము లనుభావన లొక్కటేపో

(||pallavi||)
marmamule verugāni manasu lŏkkaḍe po
kūrmule viṁtalugāni guṇamu lŏkkaḍe po

(||marma||)
rĕppale yaḍḍamugāni rebumābu mīlona
kappi sūbulu kalasiganibiṁchum̐bo
appaḍi gusagirule am̐ neḍiyaḍḍamugāni
vŏppagum̐gām̐gili sadā vŏkkaḍiyāyam̐bŏ

(||marma||)
movule yaḍḍamu gāni muṁpumovidībudenĕ
tovala nŏgaḍŏgaḍi tŏraliṁchĕm̐bo
yīvala menu menu ivi rĕṁḍiṁtegāni
sāvadhāna middarigi samarade po

(||marma||)
regale pĕkkulugāni rĕṭṭiṁchi iddarigi
yīgaḍa marugurudu li vŏkkaḍebo
segŏnu śhrīveṁkaḍeśhu sĕṁta nalamelumaṁga
paigŏnumohamu lanubhāvana lŏkkaḍebo