Maṟiyu maṟiyum balumaaru neege sharanu

మఱియు మఱియుఁ బలుమారు నీకే శరణు
Language

(॥పల్లవి॥)
మఱియు మఱియుఁ బలుమారు నీకే శరణు
అఱిముఱి సకలాంతర్యామీ శరణు

(॥మఱి॥)
సరుస మూర్తిత్రయ శరీరానికి శరణు
నిరుపమ పంచభూతనిలయా శరణు
పురిగొన్న చతుర్దశ భువనాధారా శరణు
గరిమె నింతకు మూలకారణమా శరణు

(॥మఱి॥)
పలుకఁగరాని పరబ్రహ్మమా నీకే శరణు
అలవి మీఱినట్టి కాలాత్మకా శరణు
విలసిల్లఁ బొడ చూపే విశ్వరూపమా శరణు
సలలిత బ్రహ్మాండజనకా శరణు

(॥మఱి॥)
దినకరకోటికోటి తేజమా నీకే శరణు
సనకాదియోగీంద్ర సన్నుతా శరణు
మనికైన యలమేలుమంగ విభుఁడా శరణు
ననుఁగాచే శ్రీవేంకటనాయకా శరణు

(||pallavi||)
maṟiyu maṟiyum̐ balumāru nīge śharaṇu
aṟimuṟi sagalāṁtaryāmī śharaṇu

(||maṟi||)
sarusa mūrditraya śharīrānigi śharaṇu
nirubama paṁchabhūdanilayā śharaṇu
purigŏnna sadurdaśha bhuvanādhārā śharaṇu
garimĕ niṁtagu mūlagāraṇamā śharaṇu

(||maṟi||)
palugam̐garāni parabrahmamā nīge śharaṇu
alavi mīṟinaṭṭi kālātmagā śharaṇu
vilasillam̐ bŏḍa sūbe viśhvarūbamā śharaṇu
salalida brahmāṁḍajanagā śharaṇu

(||maṟi||)
dinagaragoḍigoḍi tejamā nīge śharaṇu
sanagādiyogīṁdra sannudā śharaṇu
manigaina yalamelumaṁga vibhum̐ḍā śharaṇu
nanum̐gāse śhrīveṁkaḍanāyagā śharaṇu