మఱియేమి చెప్పేమయ్య మాటలింకాను
(॥పల్లవి॥)
మఱియేమి చెప్పేమయ్య మాటలింకాను
మెఱసి నీవే రావయ్యా మెలుఁతకడకును
(॥॥)
అక్కడికి సుద్దులు చెప్పంపిన చెలుల నాపె
నెక్కొన్నతిట్లు దిట్టె నీమారంటా
పక్కన నీకమ్మ దనపాదపుఁ బెనువేలనుఁ
జిక్కించి యందుకొనె నీచేతిదంటాను
(॥॥)
నీవంపిన బాగాలు నెఱిఁ దెల్లనాకులు
భావించి కాళాంజి లోపలఁ బెట్టించె
దేవులకు నీరాక తెలిప చెప్పఁగ బోతే
కావిరిఁ దలుపు మూసి గడె వెట్టుమనెను
(॥॥)
బలిమి నీవు దెమ్మన్న పచ్చడము గొంటా రాఁగా
వెలి దములములోన వేసి తొక్కించె
యెలమి శ్రీవేంకటేశ యింతలో నీవే విచ్చేసి
కలికి గూడఁగానే కడు సంతోసించెను
(||pallavi||)
maṟiyemi sĕppemayya māḍaliṁkānu
mĕṟasi nīve rāvayyā mĕlum̐tagaḍagunu
(||||)
akkaḍigi suddulu sĕppaṁpina sĕlula nābĕ
nĕkkŏnnadiṭlu diṭṭĕ nīmāraṁṭā
pakkana nīgamma danabādabum̐ bĕnuvelanum̐
jikkiṁchi yaṁdugŏnĕ nīsedidaṁṭānu
(||||)
nīvaṁpina bāgālu nĕṟim̐ dĕllanāgulu
bhāviṁchi kāḽāṁji lobalam̐ bĕṭṭiṁchĕ
devulagu nīrāga tĕliba sĕppam̐ga bode
kāvirim̐ dalubu mūsi gaḍĕ vĕṭṭumanĕnu
(||||)
balimi nīvu dĕmmanna pachchaḍamu gŏṁṭā rām̐gā
vĕli damulamulona vesi tŏkkiṁchĕ
yĕlami śhrīveṁkaḍeśha yiṁtalo nīve vichchesi
kaligi gūḍam̐gāne kaḍu saṁtosiṁchĕnu