Maṟivela ledaa manasu nilubaraadaa

మఱివేళ లేదా మనసు నిలుపరాదా
Language

(॥పల్లవి॥)
మఱివేళ లేదా మనసు నిలుపరాదా
గుఱిగా నిప్పుడే నన్నుఁ గూడఁగ వలెనా

(॥మఱి॥)
చెఱఁగు మాసినదాన సిగ్గువడుచున్నదాన
జఱసి సరసమేల సారెనాడేవు
చిఱునవ్వుతో నుందాన చెమటచిత్తడిదాన
యెఱుఁగుదువన్నియును యేమి బాఁతి నేను

(॥మఱి॥)
చెదరుఁ గురులదాన చేయత్తి మొక్కేదాన
అదనెఱఁగక యేల అంటవచ్చేవు
మదమొలికేటిదాన మాటున నుండేదాన
యిదివో యిట్టున్న దాన నేమిబాఁతి నేను

(॥మఱి॥)
మంచముపైనున్న దాన మతిలో లోఁగేదాన
యించుకంతా సిబ్బితిలేకేల కూడేవు
మంచి శ్రీవేంకటేశ నీ మనసు చూచినదాన
యేంచక నన్నేలితివి యేమిబాఁతి నేను

(||pallavi||)
maṟiveḽa ledā manasu nilubarādā
guṟigā nippuḍe nannum̐ gūḍam̐ga valĕnā

(||maṟi||)
sĕṟam̐gu māsinadāna sigguvaḍusunnadāna
jaṟasi sarasamela sārĕnāḍevu
siṟunavvudo nuṁdāna sĕmaḍasittaḍidāna
yĕṟum̐guduvanniyunu yemi bām̐ti nenu

(||maṟi||)
sĕdarum̐ guruladāna seyatti mŏkkedāna
adanĕṟam̐gaga yela aṁṭavachchevu
madamŏligeḍidāna māḍuna nuṁḍedāna
yidivo yiṭṭunna dāna nemibām̐ti nenu

(||maṟi||)
maṁchamubainunna dāna madilo lom̐gedāna
yiṁchugaṁtā sibbidilegela kūḍevu
maṁchi śhrīveṁkaḍeśha nī manasu sūsinadāna
yeṁchaga nannelidivi yemibām̐ti nenu