మరిగినచోటికి మంచితనమే మేలు
(॥పల్లవి॥)
మరిగినచోటికి మంచితనమే మేలు
తరవాతి పనులెల్లా తానెఱుఁగు ననరే
(॥మరి॥)
తను నేమి దూరరాదు తమక మాపగరాదు
వినయాన మొక్కేనని విన్నవించరే
పెనఁగఁగరాదు మరి ప్రియము చెప్పకపోదు
తనరూపే మనసులో తలపోసే ననరే
(॥మరి॥)
వచ్చి కక్క సించరాదు వలపు నిలుపరాదు
వినయాన మొక్కేనని విన్నవించరే
కొచ్చి కోపగించరాదు కోరికనుడుపరాదు
నిచ్చాఁదనకతలే వినేనని యనరే
(॥మరి॥)
చెనకరాదు చెనకి సిగ్గులు పడఁగరాదు
తలమేలు దాననని తలఁపించరే
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోఁదా వచ్చి నన్ను
తినిసితిఁ దానాకు తగులాయ ననరే
(||pallavi||)
mariginasoḍigi maṁchidaname melu
taravādi panulĕllā tānĕṟum̐gu nanare
(||mari||)
tanu nemi dūrarādu tamaga mābagarādu
vinayāna mŏkkenani vinnaviṁchare
pĕnam̐gam̐garādu mari priyamu sĕppagabodu
tanarūbe manasulo talabose nanare
(||mari||)
vachchi kakka siṁcharādu valabu nilubarādu
vinayāna mŏkkenani vinnaviṁchare
kŏchchi kobagiṁcharādu koriganuḍubarādu
nichchām̐danagadale vinenani yanare
(||mari||)
sĕnagarādu sĕnagi siggulu paḍam̐garādu
talamelu dānanani talam̐piṁchare
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐dā vachchi nannu
tinisidim̐ dānāgu tagulāya nanare