Marigina neege kaaga maagelaraa

మరిగిన నీకే కాక మాకేలరా
Language

(॥పల్లవి॥)
మరిగిన నీకే కాక మాకేలరా
తెరమఱఁ గింతే నీవు తీసివేయనేలరా

(॥॥)
ఆడకురా నాముందర ఆకెగుణములు సారె
గోడ గడుక నసలే కుప్పవడీని
వోడక నీ కితవైతే వుట్టి గట్టు కుందు గాని
సూడుబంటుతో బలాలు చూపి చెప్పనేలరా

(॥॥)
యెంచకురా ఆకెపొందు యెక్కుడుగా నాయెదుట
యెంచఁబోతే మంచముకిందింతా నుయ్యే
కంచముపొత్తు గలితే కలవెల్లా నితవుగా-
నించుకాఁ జలిలేకున్న నెండగాయ నేలరా

(॥॥)
కప్పకురా ఆకెచీర గట్టుకొంటి వదె నీవు
వుప్పొలికి యినుమడౌ నొద్దికైతేను
యిప్పుడె శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
దప్పికి నీరేకాక తగ నీ నెయ్యలరా

(||pallavi||)
marigina nīge kāga māgelarā
tĕramaṟam̐ giṁte nīvu tīsiveyanelarā

(||||)
āḍagurā nāmuṁdara āgĕguṇamulu sārĕ
goḍa gaḍuga nasale kuppavaḍīni
voḍaga nī kidavaide vuṭṭi gaṭṭu kuṁdu gāni
sūḍubaṁṭudo balālu sūbi sĕppanelarā

(||||)
yĕṁchagurā āgĕbŏṁdu yĕkkuḍugā nāyĕduḍa
yĕṁcham̐bode maṁchamugiṁdiṁtā nuyye
kaṁchamubŏttu galide kalavĕllā nidavugā-
niṁchugām̐ jalilegunna nĕṁḍagāya nelarā

(||||)
kappagurā āgĕsīra gaṭṭugŏṁṭi vadĕ nīvu
vuppŏligi yinumaḍau nŏddigaidenu
yippuḍĕ śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
dappigi nīregāga taga nī nĕyyalarā