మరిగితిమి గనక మనభాగ్యమే యింతా
(॥పల్లవి॥)
మరిగితిమి గనక మనభాగ్యమే యింతా
పరిపరి విధముల పంటవండె వలపు
(॥మరి॥)
చెవి సోఁకె నీ మాట సెలవికి నవ్వు వచ్చె
వివరించఁ బోతేను వింత వింతలు
రవళి మనపొందులు రవ్వలాయఁ బొరుగెల్లా
పవళించే ఇంటిలోనే పంటవండె వలపు
(॥మరి॥)
కన్నులనంటె నీరూపు కాయమెల్లాఁ జెమరించె
పన్ని చూపఁబోతేను బట్టబయలు
సన్నల మనమాటలు చలివాసె నిందరిలో
పన్నీటికాలువలఁ బంట వండె వలపు
(॥మరి॥)
చేతులఁ జిక్కె నీ రతిసిగ్గులు పలచనాయ
ఆతుమ దలఁచుకొంటే ఆనందాలు
ఘాతల శ్రీ వేంకటేశ కలసితి మిద్దరము
పై తరవు తమకాన పంట వండె వలపు
(||pallavi||)
marigidimi ganaga manabhāgyame yiṁtā
paribari vidhamula paṁṭavaṁḍĕ valabu
(||mari||)
sĕvi som̐kĕ nī māḍa sĕlavigi navvu vachchĕ
vivariṁcham̐ bodenu viṁta viṁtalu
ravaḽi manabŏṁdulu ravvalāyam̐ bŏrugĕllā
pavaḽiṁche iṁṭilone paṁṭavaṁḍĕ valabu
(||mari||)
kannulanaṁṭĕ nīrūbu kāyamĕllām̐ jĕmariṁchĕ
panni sūbam̐bodenu baṭṭabayalu
sannala manamāḍalu salivāsĕ niṁdarilo
pannīḍigāluvalam̐ baṁṭa vaṁḍĕ valabu
(||mari||)
sedulam̐ jikkĕ nī radisiggulu palasanāya
āduma dalam̐sugŏṁṭe ānaṁdālu
ghādala śhrī veṁkaḍeśha kalasidi middaramu
pai taravu tamagāna paṁṭa vaṁḍĕ valabu