Maṟigidi mide brahmaanamdamu

మఱిగితి మిదె బ్రహ్మానందము
Language

(॥పల్లవి॥)
మఱిగితి మిదె బ్రహ్మానందము
తెర మఱుఁ గింతె తెలుపఁ గదయ్య

(॥మరి॥)
మంచము మీఁదట మఱపు నిద్ధురలు
కంచములోపలి కలగూళ్ళు
పొంచిన కాంతల భోగపు సుఖములు
మంచవనుచు నివి మరిగితి నయ్యా

(॥మరి॥)
భావములోపలి బయలు గోరికలు
ఆవలఁ బంచేద్రియపు శివము
మోవక మోపగు మొఱుఁగుల దేహము
నావి యనుచు నివి నిమ్మతి నయ్యా

(॥మరి॥)
పొత్తుల కర్మము పొరుగుల పోరచి
హత్తిన సంసారమగు సంత
యిత్తల శ్రీ వేంకటేశ నీ వియ్యగా
బత్తి సేసుకొని బ్రతికితి నయ్యా

(||pallavi||)
maṟigidi midĕ brahmānaṁdamu
tĕra maṟum̐ giṁtĕ tĕlubam̐ gadayya

(||mari||)
maṁchamu mīm̐daḍa maṟabu niddhuralu
kaṁchamulobali kalagūḽḽu
pŏṁchina kāṁtala bhogabu sukhamulu
maṁchavanusu nivi marigidi nayyā

(||mari||)
bhāvamulobali bayalu gorigalu
āvalam̐ baṁchedriyabu śhivamu
movaga mobagu mŏṟum̐gula dehamu
nāvi yanusu nivi nimmadi nayyā

(||mari||)
pŏttula karmamu pŏrugula porasi
hattina saṁsāramagu saṁta
yittala śhrī veṁkaḍeśha nī viyyagā
batti sesugŏni bradigidi nayyā