మరిగి వలచితేను మరి వేసరఁగరాదు
(॥పల్లవి॥)
మరిగి వలచితేను మరి వేసరఁగరాదు
సరసము లాతనితో జరపవే చెలియా
(॥మరి॥)
యిచ్చకములే యాడితే యిగిరించు మనసులు
కొచ్చి కొచ్చి కొసరితే కూరిమి వుట్టు
కచ్చుక కాచుకుండితే కైవశములౌఁ బనులు
మెచ్చుఁ బతి తలఁపులో మెలఁగవే చెలియా
(॥మరి॥)
సారెకు మోము చూచితే సరి నాస లుప్పతిల్లు
చేరి సేవసేసితేను చెల్లుబడౌను
నేరుపుతో నవ్వితేను నిండుకొను సంతోసాలు
కోరి యీతనిఁ బాయక కొలువవే చెలియా
(॥మరి॥)
ననుపులే నెరపితే నమ్మికలు సతమౌను
వినయమే సేసితేను వేడుకలౌను
యెనసె శ్రీవేంకటేశుఁ డిందుకొరకె నిన్ను
వొనరి యిద్దరూఁ గూడి వుండరే చెలియా
(||pallavi||)
marigi valasidenu mari vesaram̐garādu
sarasamu lādanido jarabave sĕliyā
(||mari||)
yichchagamule yāḍide yigiriṁchu manasulu
kŏchchi kŏchchi kŏsaride kūrimi vuṭṭu
kachchuga kāsuguṁḍide kaivaśhamulaum̐ banulu
mĕchchum̐ badi talam̐pulo mĕlam̐gave sĕliyā
(||mari||)
sārĕgu momu sūside sari nāsa luppadillu
seri sevasesidenu sĕllubaḍaunu
nerubudo navvidenu niṁḍugŏnu saṁtosālu
kori yīdanim̐ bāyaga kŏluvave sĕliyā
(||mari||)
nanubule nĕrabide nammigalu sadamaunu
vinayame sesidenu veḍugalaunu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁdugŏragĕ ninnu
vŏnari yiddarūm̐ gūḍi vuṁḍare sĕliyā