మరిగి పాయకుండితే మంచివై తోఁచు
(॥పల్లవి॥)
మరిగి పాయకుండితే మంచివై తోఁచు
సరవి దప్పకురమ్మ సతులాల మీరు
(॥మరి॥)
చెప్పరాని విరహాన చిత్తము చిక్కువడితే
కప్పురము దిన్నాను కారమై తోఁచు
దెప్పరపు వయసే దిమ్మురేఁచ దొరకొంటే
కొప్పులోని విరులైన కొంతములై తోఁచును
(॥మరి॥)
పన్నుకొన్నవలపుల పసలబారిఁ బడితే
వెన్నెలలు గాసినాను వెట్టయై తోఁచు
వున్నతపుఁ కో(గో?)రికత నోలలాడ దొరకొంటే
చన్నులపై గందమే వేసటలై తోఁచును
(॥మరి॥)
తెగరాని సిగ్గులలో తెప్పలఁ దేలితేను
చిగురుఁ బానుపైనా చేగయైతోఁచు
నిగిడి శ్రీవేంకటాద్రి నిలయుఁడు గూడితేను
వెగటు లెల్లాఁబాసి వేడుకలై తోఁచును
(||pallavi||)
marigi pāyaguṁḍide maṁchivai tom̐su
saravi dappaguramma sadulāla mīru
(||mari||)
sĕpparāni virahāna sittamu sikkuvaḍide
kappuramu dinnānu kāramai tom̐su
dĕpparabu vayase dimmurem̐sa dŏragŏṁṭe
kŏppuloni virulaina kŏṁtamulai tom̐sunu
(||mari||)
pannugŏnnavalabula pasalabārim̐ baḍide
vĕnnĕlalu gāsinānu vĕṭṭayai tom̐su
vunnadabum̐ ko(go?)rigada nolalāḍa dŏragŏṁṭe
sannulabai gaṁdame vesaḍalai tom̐sunu
(||mari||)
tĕgarāni siggulalo tĕppalam̐ delidenu
sigurum̐ bānubainā segayaidom̐su
nigiḍi śhrīveṁkaḍādri nilayum̐ḍu gūḍidenu
vĕgaḍu lĕllām̐bāsi veḍugalai tom̐sunu