Marigi moosi daamsa mana kela

మరిగి మూసి దాఁచ మన కేల
Language

(॥పల్లవి॥)
మరిగి మూసి దాఁచ మన కేల
సొరిది నాతని కీపెఁ జూపరమ్మా

(॥॥)
చెక్కునఁ జేయి వెట్టుక చింతలఁ జిగురులమ్మీ
నిక్కువ విరహవేళ నీ లేమ
చొక్కపు విభుఁడు వేఁడె సుంకము దనకు వచ్చు
చిక్కెఁ దనపాలిటికిఁ జెప్పరమ్మ చెలులు

(॥॥)
మనసునఁ గాంతాళించి మల్లెలఁ బువ్వులు గోసీ
యెనలేని తమకాన నీయింతి
అనుగు విభుఁడు వాఁడె అరిగోలు దనసొమ్ము
వెనక ముందర విన్నవించరమ్మ చెలులూ

(॥॥)
ముంచిన కూటములనె మోవులఁ బండ్లు దాఁచీ
నెంచరాని యడియాస నీ లేమ
యెంచక శ్రీ వేంకటేశుఁ డింతలోనే యీపెఁ గూడె
నంచెల నితనిఁ గొనియాడరమ్మ చెలులు.

(||pallavi||)
marigi mūsi dām̐sa mana kela
sŏridi nādani kībĕm̐ jūbarammā

(||||)
sĕkkunam̐ jeyi vĕṭṭuga siṁtalam̐ jigurulammī
nikkuva virahaveḽa nī lema
sŏkkabu vibhum̐ḍu vem̐ḍĕ suṁkamu danagu vachchu
sikkĕm̐ danabāliḍigim̐ jĕpparamma sĕlulu

(||||)
manasunam̐ gāṁtāḽiṁchi mallĕlam̐ buvvulu gosī
yĕnaleni tamagāna nīyiṁti
anugu vibhum̐ḍu vām̐ḍĕ arigolu danasŏmmu
vĕnaga muṁdara vinnaviṁcharamma sĕlulū

(||||)
muṁchina kūḍamulanĕ movulam̐ baṁḍlu dām̐sī
nĕṁcharāni yaḍiyāsa nī lema
yĕṁchaga śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalone yībĕm̐ gūḍĕ
naṁchĕla nidanim̐ gŏniyāḍaramma sĕlulu.