Marigi marigi taanu maganaali valene

మరిగి మరిగి తాను మగనాలి వలెనే
Language

(॥పల్లవి॥)
మరిగి మరిగి తాను మగనాలి వలెనే
సరని దెలిసి లోలో సన్నసేయరే

(॥మరి॥)
మెలుపునఁ బిలువఁగ మెత్తఁగానే పలికీని
వెలి నెవ్వరైనా నది వినేరంటానో
చెలులు వొద్దనుండఁగా సిగ్గులు రేఁగఁగఁబోలు
తలఁపు దెలిసి యేకతానఁ జెప్పరే

(॥మరి॥)
కానుక చేతికివ్వఁగా కానకుండా నందుకొనీ
కానీలేవే యెవ్వరైనాఁ గనేరంటానో
తానెవ్వతెకైనా మాట తగులఁగ నియ్యఁబోలు
యేనెపములైనాఁ జూపి యింటికిఁ దేరే

(॥మరి॥)
పలుమారు మొక్కఁగాను పరాకువలెనే వచ్చె
బలిమి గుట్టు బయటఁ బడీనంటానో
యెలమి శ్రీవేంకటేశుఁ డీడగాఁగా నన్నుఁ గూడె
వలపుకొలఁదినే రవ్వలు సేయరే

(||pallavi||)
marigi marigi tānu maganāli valĕne
sarani dĕlisi lolo sannaseyare

(||mari||)
mĕlubunam̐ biluvam̐ga mĕttam̐gāne paligīni
vĕli nĕvvarainā nadi vineraṁṭāno
sĕlulu vŏddanuṁḍam̐gā siggulu rem̐gam̐gam̐bolu
talam̐pu dĕlisi yegadānam̐ jĕppare

(||mari||)
kānuga sedigivvam̐gā kānaguṁḍā naṁdugŏnī
kānīleve yĕvvarainām̐ ganeraṁṭāno
tānĕvvadĕgainā māḍa tagulam̐ga niyyam̐bolu
yenĕbamulainām̐ jūbi yiṁṭigim̐ dere

(||mari||)
palumāru mŏkkam̐gānu parāguvalĕne vachchĕ
balimi guṭṭu bayaḍam̐ baḍīnaṁṭāno
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍīḍagām̐gā nannum̐ gūḍĕ
valabugŏlam̐dine ravvalu seyare