Marige vippudunu aamaada limkaanu

మరిగే విప్పుడును ఆమాట లింకాను
Language

(॥పల్లవి॥)
మరిగే విప్పుడును ఆమాట లింకాను
దొరతో సరిమాటాడే దోసమే చాలదా

(॥మరి॥)
చెక్కునొక్కి నన్ను నీవు చేరి వేఁడుకొనే విదే
మొక్కే నందుకు నేను ముమ్మాటికి
యెక్కడిసుద్దులు యింకా నేలతడవేపు సారె
తొక్కితి నీ పాదము ఆదోసమే చాలదా

(॥మరి॥)
కలకల నవ్వునవ్వి కరగించే విందుకు నే
భళియని పొగడేను పదిమారులు
వలెనా ఇవియుఁ గొన్ని వద్దు వద్దు రేఁచనేల
తొలుత సేసపట్టినదోసమే చాలదా

(॥మరి॥)
కమ్మర నాకొంగు వట్టి కాఁగిలించితి విందుకు
నమ్మె నలమేల్మంగ నున్నతి వేమారు
వుమ్మడి నుండనీ మాట లూరకే శ్రీ వేంకటేశ
దోమ్మిసేసితి రతుల దోసమే చాలదా

(||pallavi||)
marige vippuḍunu āmāḍa liṁkānu
dŏrado sarimāḍāḍe dosame sāladā

(||mari||)
sĕkkunŏkki nannu nīvu seri vem̐ḍugŏne vide
mŏkke naṁdugu nenu mummāḍigi
yĕkkaḍisuddulu yiṁkā neladaḍavebu sārĕ
tŏkkidi nī pādamu ādosame sāladā

(||mari||)
kalagala navvunavvi karagiṁche viṁdugu ne
bhaḽiyani pŏgaḍenu padimārulu
valĕnā iviyum̐ gŏnni vaddu vaddu rem̐sanela
tŏluda sesabaṭṭinadosame sāladā

(||mari||)
kammara nāgŏṁgu vaṭṭi kām̐giliṁchidi viṁdugu
nammĕ nalamelmaṁga nunnadi vemāru
vummaḍi nuṁḍanī māḍa lūrage śhrī veṁkaḍeśha
dommisesidi radula dosame sāladā