మఱి యేఁటివిన్నపము మాపు దాఁకాఁ జేసేము
(॥పల్లవి॥)
మఱి యేఁటివిన్నపము మాపు దాఁకాఁ జేసేము
గుఱిఁగా నీవే తెలుసుకోవయ్య ఇపుడు
(॥మఱి॥)
కచ్చువెట్టి నీరూపము కన్నులఁజూచి యింతి
అచ్చపుమోవితేనకు నాసపడీని
కొచ్చి కొచ్చి వీనుల నీగుణములు వినివిని
ఇచ్చలో నీపొందులకు నేకరీ దాను
(॥మఱి॥)
ననుపున సెలవుల నవ్వుతానే అప్పటిని
చెనకి యిట్టె నీపై చేయివేసీని
వొనర నీవద్దఁ బాయకుండివుండి తమకించి
పెనఁగులాడుచు సారెఁ బ్రియముచెప్పీని
(॥మఱి॥)
ఇందు నందు నిందాఁకా నెడమాటలాడించి
కందువతోఁ దానే వచ్చి కాఁగిలించీని
అందపు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
మందలించి నీయెదుట మచ్చిక చల్లీని
(||pallavi||)
maṟi yem̐ṭivinnabamu mābu dām̐kām̐ jesemu
guṟim̐gā nīve tĕlusugovayya ibuḍu
(||maṟi||)
kachchuvĕṭṭi nīrūbamu kannulam̐jūsi yiṁti
achchabumovidenagu nāsabaḍīni
kŏchchi kŏchchi vīnula nīguṇamulu vinivini
ichchalo nībŏṁdulagu negarī dānu
(||maṟi||)
nanubuna sĕlavula navvudāne appaḍini
sĕnagi yiṭṭĕ nībai seyivesīni
vŏnara nīvaddam̐ bāyaguṁḍivuṁḍi tamagiṁchi
pĕnam̐gulāḍusu sārĕm̐ briyamusĕppīni
(||maṟi||)
iṁdu naṁdu niṁdām̐kā nĕḍamāḍalāḍiṁchi
kaṁduvadom̐ dāne vachchi kām̐giliṁchīni
aṁdabu śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
maṁdaliṁchi nīyĕduḍa machchiga sallīni