మఱి యేఁటి విన్నపాలు మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మఱి యేఁటి విన్నపాలు మాపు దాఁకాను
నెఱవాదు లిన్నిటాను నేరరా మీరు
(॥మఱి॥)
చెలులచే మాఁటలు సిగ్గులు దేరినదాఁకా
సొలపులు తనువులు సోఁకినదాఁకా
తలపోఁతలన్నియును దండకు వచ్చినదాఁకా
చెలుములు చనవులు చేకొన్నదాఁకానే
(॥మఱి॥)
కడలేని సరసాలు కందువలబ్బినదాఁకా
వెడ మాయకోపము నవ్వినదాఁకాను
తడబాటు తమకము తనివి దీరినదాఁకా
కడివోని యాస లేకతమౌదాఁకానే
(॥మఱి॥)
వింతముచ్చటలు వెల్లవిరిగా నాడినదాఁకా
పంతములన్నియు నొడఁబడినదాఁకా
ఇంతయు శ్రీవేంకటేశ యీపెతోఁ గూడినదాఁకా
సంతమైతిరి మాకోర్కె సమకూరుదాఁకా
(||pallavi||)
maṟi yem̐ṭi vinnabālu mābu dām̐kānu
nĕṟavādu linniḍānu nerarā mīru
(||maṟi||)
sĕlulase mām̐ṭalu siggulu derinadām̐kā
sŏlabulu tanuvulu som̐kinadām̐kā
talabom̐talanniyunu daṁḍagu vachchinadām̐kā
sĕlumulu sanavulu segŏnnadām̐kāne
(||maṟi||)
kaḍaleni sarasālu kaṁduvalabbinadām̐kā
vĕḍa māyagobamu navvinadām̐kānu
taḍabāḍu tamagamu tanivi dīrinadām̐kā
kaḍivoni yāsa legadamaudām̐kāne
(||maṟi||)
viṁtamuchchaḍalu vĕllavirigā nāḍinadām̐kā
paṁtamulanniyu nŏḍam̐baḍinadām̐kā
iṁtayu śhrīveṁkaḍeśha yībĕdom̐ gūḍinadām̐kā
saṁtamaidiri māgorgĕ samagūrudām̐kā