Maṟi yemidigim gaadu madinela padarevu

మఱి యేమిటికిఁ గాదు మతినేల పదరేవు
Language

(॥పల్లవి॥)
మఱి యేమిటికిఁ గాదు మతినేల పదరేవు
తఱిఁ దొల్లింటి పనులే తలఁచుఁగాని

(॥మఱి॥)
పంతమేల యిచ్చేవు బాసలేల సేసేవు
యింతి పిలిచిన పని యిందుకుఁ గాదు
చింతదీర నీకు నాపె సేవసేసి మెప్పించి
అంతరంగము చేకొనేననికాని

(॥మఱి॥)
నవ్వులేల నవ్వేవు నాటకమేల సేసేవు
యివ్వల సతి మొక్కిన దిందుకుఁ గాదు
పువ్వువలె భోగించి పొదిగి నిన్నుఁ జొక్కించి
అవ్వల నీకృపఁ బొందేననికాని

(॥మఱి॥)
చెక్కులేల నొక్కేవు సిగ్గులేల ముంచేవు
అక్కునఁ జేకొన్నది యందుకుఁ గాదు
యిక్కువ శ్రీవేంకటేశ యింతి నీవు గూడఁగాను
అక్కజమై నిను మెచ్చేనని కాని

(||pallavi||)
maṟi yemiḍigim̐ gādu madinela padarevu
taṟim̐ dŏlliṁṭi panule talam̐sum̐gāni

(||maṟi||)
paṁtamela yichchevu bāsalela sesevu
yiṁti pilisina pani yiṁdugum̐ gādu
siṁtadīra nīgu nābĕ sevasesi mĕppiṁchi
aṁtaraṁgamu segŏnenanigāni

(||maṟi||)
navvulela navvevu nāḍagamela sesevu
yivvala sadi mŏkkina diṁdugum̐ gādu
puvvuvalĕ bhogiṁchi pŏdigi ninnum̐ jŏkkiṁchi
avvala nīkṛpam̐ bŏṁdenanigāni

(||maṟi||)
sĕkkulela nŏkkevu siggulela muṁchevu
akkunam̐ jegŏnnadi yaṁdugum̐ gādu
yikkuva śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍam̐gānu
akkajamai ninu mĕchchenani kāni