మఱి యేమి విన్నవించే మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మఱి యేమి విన్నవించే మాపు దాఁకాను
తఱవాతి పనులెల్లా తానే యెఱుఁగునే
(॥మఱి॥)
మగఁడు లాలించితేను మచ్చిక తానే కలుగు
నగితేను మిక్కిలి నమ్మికవుట్టు
మొగము చూచితేను ముంచుకొను నాసలు
తగవు తానే యెఱుఁగు తలఁచుకొమ్మననే
(॥మఱి॥)
చేరి సేవలు గొంటేను చిత్తము తానే కరఁగు
సారె సరసమాడితే సంతోస మెక్కు
గారవించి మన్నించితే కాఁపురము లీడేరు
తారుకాణ లన్నియును తలఁచుకొమ్మనవే
(॥మఱి॥)
ననుపులు నెరపితే నారుకొనుఁ బ్రియములు
పెనఁగితే మీఁద మీదఁ బెరుగుఁ దమి
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె తానే వచ్చి
తననా సంది పొందులు తలఁచుకొమ్మనవే
(||pallavi||)
maṟi yemi vinnaviṁche mābu dām̐kānu
taṟavādi panulĕllā tāne yĕṟum̐gune
(||maṟi||)
magam̐ḍu lāliṁchidenu machchiga tāne kalugu
nagidenu mikkili nammigavuṭṭu
mŏgamu sūsidenu muṁchugŏnu nāsalu
tagavu tāne yĕṟum̐gu talam̐sugŏmmanane
(||maṟi||)
seri sevalu gŏṁṭenu sittamu tāne karam̐gu
sārĕ sarasamāḍide saṁtosa mĕkku
gāraviṁchi manniṁchide kām̐puramu līḍeru
tārugāṇa lanniyunu talam̐sugŏmmanave
(||maṟi||)
nanubulu nĕrabide nārugŏnum̐ briyamulu
pĕnam̐gide mīm̐da mīdam̐ bĕrugum̐ dami
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ tāne vachchi
tananā saṁdi pŏṁdulu talam̐sugŏmmanave