మఱి యేమనునే నన్ను మాటిమాటికి
(॥పల్లవి॥)
మఱి యేమనునే నన్ను మాటిమాటికి
మఱచె నంటా నుంటి మావిూఁది వలపు
(॥మఱి॥)
యెనసి తానును నేను యెప్పుడైనా నాదుకొన్న
తనివోని మాట లెల్లాఁ దలఁచునా
మనసు ముట్టినయట్టి మర్మములు చెప్పరాక
ఘనుఁడు లోలోనే తాను కరఁగునా
(॥మఱి॥)
ఆరగించేటివేళల అద్దము చూచేటివేళ
తారుకాణగా నన్నుఁ దలఁచునా
సారెకుఁ గిన్నెర మీఁటిఁ సంగడిచెలులతోడ
చేరి చేరి నాసుద్దులు చెప్పి మెచ్చునా
(॥మఱి॥)
యితవై తాఁ జెప్పినట్టు యిచ్చకములే చేసి
తతి నేఁ జేసినమేలు దలఁచునా
యితఁడే శ్రీవేంకటేశుఁ డేడనుండో వచ్చి నాకు
పతి దానై కూడి వాఁడే పవళించినాఁడు
(||pallavi||)
maṟi yemanune nannu māḍimāḍigi
maṟasĕ naṁṭā nuṁṭi māviూm̐di valabu
(||maṟi||)
yĕnasi tānunu nenu yĕppuḍainā nādugŏnna
tanivoni māḍa lĕllām̐ dalam̐sunā
manasu muṭṭinayaṭṭi marmamulu sĕpparāga
ghanum̐ḍu lolone tānu karam̐gunā
(||maṟi||)
āragiṁcheḍiveḽala addamu sūseḍiveḽa
tārugāṇagā nannum̐ dalam̐sunā
sārĕgum̐ ginnĕra mīm̐ṭim̐ saṁgaḍisĕluladoḍa
seri seri nāsuddulu sĕppi mĕchchunā
(||maṟi||)
yidavai tām̐ jĕppinaṭṭu yichchagamule sesi
tadi nem̐ jesinamelu dalam̐sunā
yidam̐ḍe śhrīveṁkaḍeśhum̐ ḍeḍanuṁḍo vachchi nāgu
padi dānai kūḍi vām̐ḍe pavaḽiṁchinām̐ḍu