మఱి యేల దాఁచేవూ మాకు నీ వలపులు
(॥పల్లవి॥)
మఱి యేల దాఁచేవూ మాకు నీ వలపులు
యెఱిఁగిన పనులకు నేల వొద్దు వెఱపు
(॥॥)
చెక్కు నొక్కి వేఁడుకొనెఁ జెలియ నిన్ను
గక్కున నీ మోమునఁ గళ రె క్కె ను
వొక్కటియై యాకె నీ వొడి పట్టెను
మక్కువతో నీ మేనఁ జెమటలు నిండెను
(॥॥)
ఆనుక చన్నుల నొత్తె నంగన నిన్ను
మే నెల్లఁ బులకించె మిక్కిలి నీకు
నానఁ బెట్టి యాకె నీతో నవ్వు నవ్వెను
కానుకగా నీ మనసు కరఁగి చొక్కితివి
(॥॥)
పొంచి నిన్నుఁ గౌఁగిలించె భూ రమణి
మించె నీకు నానందము మీఁద మీఁదనూ
యెంచఁగ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
అంచెల నన్నేలితివి ఆకె నిన్ను మెచ్చెనూ.
(||pallavi||)
maṟi yela dām̐sevū māgu nī valabulu
yĕṟim̐gina panulagu nela vŏddu vĕṟabu
(||||)
sĕkku nŏkki vem̐ḍugŏnĕm̐ jĕliya ninnu
gakkuna nī momunam̐ gaḽa rĕ kkĕ nu
vŏkkaḍiyai yāgĕ nī vŏḍi paṭṭĕnu
makkuvado nī menam̐ jĕmaḍalu niṁḍĕnu
(||||)
ānuga sannula nŏttĕ naṁgana ninnu
me nĕllam̐ bulagiṁchĕ mikkili nīgu
nānam̐ bĕṭṭi yāgĕ nīdo navvu navvĕnu
kānugagā nī manasu karam̐gi sŏkkidivi
(||||)
pŏṁchi ninnum̐ gaum̐giliṁchĕ bhū ramaṇi
miṁchĕ nīgu nānaṁdamu mīm̐da mīm̐danū
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
aṁchĕla nannelidivi āgĕ ninnu mĕchchĕnū.