Maṟi yaamdum bodeddemdu magabodimaa nemdu

మఱి యాఁడుఁ బోడెడ్డెఁడు మగపోడిమా నేఁడు
Language

(॥పల్లవి॥)
మఱి యాఁడుఁ బోడెడ్డెఁడు మగపోడిమా నేఁడు
జఱసితే వలపులు సంతలో నమ్మీని

(॥మఱి॥)
మొలక వెన్నెలలు మోసులెత్తె నేఁటికే
కలికివి యికతము చెప్పివే
కలువబాణాలు గురి గాఁడిసారీ నేఁటికే
తలపోసి చూచితేను తారుకాణ లౌను

(॥మఱి॥)
మాఁటలాడితేను మెరచీ మాణికా లివేడవే
నీఁటునఁ దెలియ నారునెల్లగళువే
పేటలైనపగడాలలోఁ బెరతేనె లున్నవే
వాఁటముగాఁ జవిగొనే వారి వారి భాగ్యము

(॥మఱి॥)
మెఱుగును మేఘమును మేళవించి నిదేమే
యెఱిఁగితే మరపుల నెనయునట
అఱిమురి శ్రీవేంకటాధిపుఁడను నాకు
తొఱలి బువ్వపుఁ బొత్తు దొరకెఁగదే

(||pallavi||)
maṟi yām̐ḍum̐ boḍĕḍḍĕm̐ḍu magaboḍimā nem̐ḍu
jaṟaside valabulu saṁtalo nammīni

(||maṟi||)
mŏlaga vĕnnĕlalu mosulĕttĕ nem̐ṭige
kaligivi yigadamu sĕppive
kaluvabāṇālu guri gām̐ḍisārī nem̐ṭige
talabosi sūsidenu tārugāṇa launu

(||maṟi||)
mām̐ṭalāḍidenu mĕrasī māṇigā liveḍave
nīm̐ṭunam̐ dĕliya nārunĕllagaḽuve
peḍalainabagaḍālalom̐ bĕradenĕ lunnave
vām̐ṭamugām̐ javigŏne vāri vāri bhāgyamu

(||maṟi||)
mĕṟugunu meghamunu meḽaviṁchi nideme
yĕṟim̐gide marabula nĕnayunaḍa
aṟimuri śhrīveṁkaḍādhibum̐ḍanu nāgu
tŏṟali buvvabum̐ bŏttu dŏragĕm̐gade