మఱి వెనక నాతోను మాటలాడుదువుగాని
(॥పల్లవి॥)
మఱి వెనక నాతోను మాటలాడుదువుగాని
గుఱుతులు దాఁచుకోవే కొమ్మలు నవ్వేరు
(॥మఱి॥)
పిక్కటిల్లుఁజన్నులపై పెనగొన్నహారాలు
చిక్కువడీ దిద్దుకోవే చక్కఁగా నీవు
చుక్కబొట్టు చెమటలఁ జొబ్బిలఁగాఁ గరఁగెను
గక్కన నద్దముచూచి గందమువెట్టుకోవే
(॥మఱి॥)
కొప్పులోనిసంపెఁగలు కొణికలవెంటజారీ
విప్పక ముడుచుకోవే వేగఁ దురుము
పిప్పిగట్టి పెదవులు పిడి చినట్టున్నది
దప్పిదేర వేసుకోవే కప్పురబాగాలు
(॥మఱి॥)
కట్టనచీర వదలి కానవచ్చీఁ బోఁకముడి
వొట్టి బిగించుకొనవే వొడ్డాణము
యిట్టె శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
నెట్టన నన్నేలెఁ బొందు నీవూఁ దెలుపుకోవే
(||pallavi||)
maṟi vĕnaga nādonu māḍalāḍuduvugāni
guṟudulu dām̐sugove kŏmmalu navveru
(||maṟi||)
pikkaḍillum̐jannulabai pĕnagŏnnahārālu
sikkuvaḍī diddugove sakkam̐gā nīvu
sukkabŏṭṭu sĕmaḍalam̐ jŏbbilam̐gām̐ garam̐gĕnu
gakkana naddamusūsi gaṁdamuvĕṭṭugove
(||maṟi||)
kŏppulonisaṁpĕm̐galu kŏṇigalavĕṁṭajārī
vippaga muḍusugove vegam̐ durumu
pippigaṭṭi pĕdavulu piḍi sinaṭṭunnadi
dappidera vesugove kappurabāgālu
(||maṟi||)
kaṭṭanasīra vadali kānavachchīm̐ bom̐kamuḍi
vŏṭṭi bigiṁchugŏnave vŏḍḍāṇamu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
nĕṭṭana nannelĕm̐ bŏṁdu nīvūm̐ dĕlubugove